Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC ఫైనల్ ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

ICC confirmed WTC final to be played at The Oval from June 7 to 11

దుబాయ్: ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 ఎడిషన్‌కు సంబంధించిన ఫైనల్ ముహుర్తం ఖారారైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ఈ టైటిల్ ఫైట్ నిర్వహిస్తామని ఐసీసీ బుధవారం ప్రకటించింది. జూన్ 12ను రిజర్వ్ డేగా కేటాయించింది.
ఈ చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ చేరగా.. మరో బెర్త్ కోసం టీమిండియా, శ్రీలంక, సౌతాఫ్రికా పోటీపడుతున్నాయి.

రెండేళ్ల పాటు 9 జట్ల మధ్య జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 24 టెస్టుల్లో 61 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ప్రారంభంకాబోతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ ఇరు జట్లకు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరిది. న్యూజిలాండ్‌తో శ్రీలంక, వెస్టిండీస్‌తో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది.

టాప్‌లో ఆసీస్..

టాప్‌లో ఆసీస్..

ప్రస్తుతానికి ఈ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు 136 పాయింట్లతో టాప్‌లో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 14 మ్యాచ్‌లాడిన భారత్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి 99 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక 10 మ్యాచ్‌లాడి 5 విజయాలతో 64 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అలానే దక్షిణాఫ్రికా కూడా 13 మ్యాచ్‌లాడి 6 విజయాలతో 76 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కానీ ఆస్ట్రేలియా మాత్రం 15 మ్యాచ్‌లాడి 10 విజయాలు సాధించింది. కరోనా టైమ్ నుంచి జట్ల ర్యాంకింగ్స్‌ని పాయింట్ల ఆధారంగా కాకుండా మ్యాచ్‌ల గెలుపు శాతం ఆధారంగా నిర్ణయిస్తున్నారు. దాంతో ఆస్ట్రేలియా (75.56%), భారత్ (58.93%), శ్రీలంక (53.33%), దక్షిణాఫ్రికా (48.72%) టాప్-4లో కొనసాగుతున్నాయి.

విజయం సాధిస్తేనే ఫైనల్ బెర్త్..

విజయం సాధిస్తేనే ఫైనల్ బెర్త్..

ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్ (2021-2023) ఫైనల్‌కి భారత్ అర్హత సాధించాలంటే? గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను తప్పక గెలవాల్సి ఉంది. కనీసం రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా.. ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఫైనల్ బెర్తు చేజారే ప్రమాదం ఉంది. ఈ సిరీస్‌కి భారత్ ఆతిథ్యం ఇస్తుండటం టీమిండియాకి గొప్ప ఊరట.

అప్పుడు ఓటమి..

అప్పుడు ఓటమి..

డబ్లూటీసీ తొలి ఎడిషన్‌లో కూడా అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా.. కీలక ఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. వర్షం అంతరాయం కారణంగా 6 రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక ఐపీఎల్ 2023 సీజన్ అనంతరం తాజా ఎడిషన్ ఫైనల్ జరగనుండటం టీమిండియా(ఫైనల్ చేరితే) ప్రతికూలం కానుంది.

Story first published: Wednesday, February 8, 2023, 18:00 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+