
కొన్ని వాయిదా.. మరికొన్ని రద్దు
అయితే కోవిడ్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మలేషియా వేదికగా జరగాల్సిన సీడబ్ల్యూసి ఛాలెంజ్ లీగ్ మ్యాచ్‌లను వాయిదా వేసింది. కెనడా, డెన్‌మార్క్, మలేషియా, కటార్, సింగపూర్, వనౌటు పాల్గొనల్సిన ఈ 11 రోజుల ఈవెంట్‌ని ఈ ఏడాదిలో కొన్ని నెలల తర్వాత నిర్వహిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో పాటు థాయ్‌లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టీ-20 సిరీస్‌ను కూడా రద్దు చేశారు. అంతేకాక.. నేపాల్ ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్‌ని కూడా రద్దు అయింది.

షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్..
మరోవైపు ఐపీఎల్, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌పై కరోనా ప్రభావం లేదని షెడ్యూల్ ప్రకారమే క్యాష్ రిచ్ లీగ్, వన్డే సిరీస్ జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. భారత్‌లో కరోనా వైరసే లేదని, దానిపై చర్చ కూడా అనవసరమని తెలిపాడు. షెడ్యూల్ ప్రకారమే సౌతాఫ్రికా జట్టుకు భారత్‌కు వస్తుందని, మ్యాచ్‌లు ఆడుతుందన్నాడు. మార్చి 12న ధర్మశాల వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కరోనా వైరస్ గురించి తాము ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు తెలిపాడు. కరోనా ముప్పు ఐపీఎల్‌కు ఏమాత్రం ఉండబోదన్నాడు.

3వేల మందికి పైగా..
ప్రపంచవ్యాప్తంగా 90 వేల మంది ఈ వ్యాధి బారిన పడగా.. దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీని దెబ్బకు చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దయ్యాయి. ఒలింపిక్స్ నిర్వహణపై కూడా అనుమానం నెలకొంది. ఇటలీలోనైతే ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా విదేశీ టోర్నీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అథ్లెట్ల ఆరోగ్యమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications
