Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక బ్యాడ్ లైట్‌తో బాధ లేదు.. ఐసీసీ నయా రూల్స్ ఇవే!

అంతర్జాతీయ క్రికెట్‌లో పలు మార్పులకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శ్రీకారం చుట్టింది. టెస్ట్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చేలా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా పాల్గొన్నారు. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

టీ20, టెస్ట్ క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్స్

మ్యాచ్ మధ్యలో పింక్ బాల్..

ఇప్పటివరకు డే టెస్ట్‌ల్లో రెడ్ బాల్‌తో ఆడేవారు. ఇక నుంచి టెస్ట్ మ్యాచ్‌లో వెలుతురు తక్కువగా ఉండే సమయంలో ఇరు జట్ల అంగీకారంతో మ్యాచ్ మధ్యలో గులాబీ బంతిని ఉపయోగించవచ్చు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఐసీసీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో మ్యాచ్ జరిగే సమయం పెంచేలా ఈ చర్య ఉపయోగపడుతుంది. బ్యాడ్ లైట్‌తో బాధ లేకుండా పోతుంది.

అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ను అంచనా వేయడానికి అంపైర్లు 'హాక్-ఐ' డేటాను ఉపయోగించేందుకు ఆమోదం తెలిపింది.

ICC Board Meeting Pink Ball Introduced to Tackle Bad Light in Test Matches Coaches Allowed During Drinks Break

అధికారిక డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్ ఆటగాళ్లతో మాట్లాడటానికి అనమతించింది.

టీ20ల్లో 15 నిమిషాల ఇన్నింగ్స్ బ్రేక్స్‌ను తప్పనిసరి చేసింది. ఆట తిరిగి ప్రారంభమైనప్పుడు బ్యాటర్లు సిద్దంగా ఉండాలని సూచించింది.

వెలుతురు లేమి పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న లైట్ మీటర్ విధానం విషయంలో కొత్త సూచనలను అంగీకరించింది.

లెగ్ సైడ్ వైడ్స్ విషయంలో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన మార్పులను పూర్తి స్థాయిలో అమలు చేయనుంది.

మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ..

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 నిర్వహణ విండోలో మార్పునకు బోర్డు ఆమోదం తెలిపింది. జూన్-జులై నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14-28 తేదీలకు మార్చింది.

ఐదు సభ్య దేశాలు.. ఐదు అసోసియేట్ సభ్య దేశాలతో ఐసీసీ మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ 2026ని నిర్వహించనున్నారు.

Story first published: Tuesday, June 2, 2026, 9:02 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+