ఫిఫాను దాటేసిన ఐసీసీ.. సోషల్ మీడియాలో రికార్డు!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా(ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్)లో అత్యంత ఆదరణ కలిగిన క్రీడా సంస్థగా ఐసీసీ రికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంస్థ అయిన 'ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్' (ఫిఫా)ను కూడా దాటేసింది.
ఐసీసీకి సోషల్ మీడియాలో 59 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. ఫిఫాకు 37.7 మిలియన్లు, ఫిబా(అంతర్జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య)కు 12.2 మిలియన్ల మంది ఉన్నారు. ఐసీసీ పోస్టులకు అభిమానుల నుంచి చాలా ఆదరణ ఉంటుందని బీసీడబ్ల్యూ స్పోర్ట్స్ అనే కన్సెల్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
ఇక ఫిఫాలో ఎన్నో దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉండటంతో ఈ సంస్థ కూడా అన్ని దేశాలకు విస్తరించింది. మరోవైపు ఐసీసీ కూడా పలు దేశాల్లో వ్యాపించి ఉంది. కానీ, సభ్యత్వాల విషయంలో ఫిఫా కంటే వెనుకబడి ఉన్నది. కానీ సోషల్ మీడియాలో మాత్రం టాప్‌లో దూసుకెళ్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications