Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక నుంచి ఆ క్యాచ్‌లపై నిషేధం.. బౌండరీ క్యాచ్‌ రూల్‌ను మార్చిన ఐసీసీ

క్రికెట్ నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మరో కీలక మార్పు చేసింది. బన్నీ హాప్ క్యాచ్‌లపై నిషేధం విధించింది. ఈ మార్పుతో బౌండరీ లైన్‌పై అందుకునే క్యాచ్‌లపై మరింత స్పష్టతను ఇచ్చింది. ఇక బౌండరీ‌పై క్యాచ్‌లు అందుకునే ఫీల్డర్లు.. బయట ఒకసారి మాత్రమే బంతిని తాకాలి. రెండోసారి తాకితే సిక్సర్‌గా పరగణిస్తారు.

గతంలో బౌండరీ బయట గాల్లో ఉంటూ బంతిని ఒకటి కంటే ఎక్కువ సార్లు తాకి అందుకున్న ఔటిచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ రూల్‌ను సవరించారు. బౌండరీ బయట గాల్లో ఒకసారి మాత్రమే బంతిని తాకాలి. మరోసారి తాకితే సిక్సర్‌గా ఇస్తారు. ఈ రూల్ రిలే క్యాచ్‌లకు కూడా వర్తిస్తుంది. అంటే ఓ ఫీల్డర్ బౌండరీ బయట బంతిని గాల్లో నుంచి లోపల ఉన్న ఫీల్డర్‌కు అంద జేసినా.. అతను పూర్తిగా గ్రౌండ్‌లోనే ఉండాలి. లేకుంటే ఇది కూడా బౌండరీ అవుతుంది.

ICC Bans Bunny Hop Catches at Boundary Line
Photo Credit: screen grab for X video

ఆస్ట్రేలియా టీ20 ఫ్రాంచైజీ టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో మైకేల్ నెసర్ అందుకున్న ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ బయట మైకేల్ నెసర్.. రెండు సార్లు బంతిని తాకి క్యాచ్‌ను పూర్తి చేశాడు. పాత రూల్స్ ప్రకారం అది ఔట్ అయినా.. ఇక నుంచి అలాంటి క్యాచ్‌లు బౌండరీగా మారుతాయి. మైకేల్ నెసర్ అందుకున్న ఈ క్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. దాంతో ఈ రూల్‌ను ఐసీసీ సవరించింది. ఈ నయా రూల్.. మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌ రూల్‌ బుక్‌లో అక్టోబర్ 2026‌లో అధికారికంగా చేర్చనున్నారు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా జూన్ 17 నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ రూల్‌ను అమలు చేయనున్నారు.

Story first published: Saturday, June 14, 2025, 14:54 [IST]
Other articles published on Jun 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+