U19 World Cup షెడ్యూల్ ఇదే.. బంగ్లాతో భారత్ తొలి పోరు
దుబాయ్: అండర్ 19 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. సీనియర్ల వన్డే ప్రపంచకప్ ముగిసిన రెండు నెలల్లోనే అండర్ 19 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలో (2024) జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు అండర్ -19 వరల్డ్ కప్ జరగనుంది. పదిహేనో ఎడిషన్ అండర్ 19 ప్రపంచకప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
శ్రీలంక - జింబాబ్వే జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జనవరి 14న తలపడనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నాయి. గ్రూప్ ఏలో యువ భారత్ ఆడనుండగా.. లీగ్ దశలో బంగ్లాదేశ్ (జనవరి 14న), యూఎస్‌ఏ (18న), ఐర్లాండ్ (20న)తో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడుతుంది.

నాలుగు గ్రూప్‌ల నుంచి టాప్ -3 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. మళ్లీ రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్ మ్యాచ్‌లు ఆడుతాయి. ఆ తర్వాత ఫైనల్‌కు చేరే జట్లు ఏవో ఈ నాలుగింటిలోనే తేలుతాయి. జనవరి 6 నుంచి 12 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications