For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test Team Of The Year 2024: కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్.. భారత్ నుంచి ముగ్గురే!

గతేడాది టెస్ట్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) అత్యుత్తమ జట్టు‌ను ప్రకటించింది. ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 పేరిట ఈ జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది. వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ప్రకటించిన కాసేపటికే అత్యుత్తమ టెస్ట్ టీమ్‌‌ను ఐసీసీ ప్రకటించింది.

వన్డే టీమ్‌లో భారత్ నుంచి ఒక్క ఆటగాడికి అవకాశం దక్కకపోగా.. టెస్ట్ టీమ్‌లో మాత్రం ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 జట్టుకు ఎంపికయ్యారు.

ICC Announces Test Team Of The Year 2024 No Kohli and Rohit Jasprit Bumrah among 3 Indians featured

నో కోహ్లీ, రోహిత్..
ఈ జట్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ విరాట్ కోహ్లీకి అవకాశం దక్కలేదు. గతేడాది ఈ ఇద్దరూ టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. గతేడాది కోహ్లీ 10 టెస్ట్‌ల్లో 24.52 సగటుతో 417 పరుగులు మాత్రమే చేయగా.. రోహిత్ 24.76 యావరేజ్‌తో 619 పరుగులే చేశాడు. ఫ్యాబ్-4 నుంచి స్మిత్, కోహ్లీకి మాత్రమే ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కలేదు.

ఓపెనర్‌గా జైస్వాల్..
22 ఏళ్ల యశస్వి జైస్వాల్.. గతేడాది టెస్ట్‌ల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. 54.74 సగటుతో 1474 పరుగులు చేసి భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 36 సిక్స్‌లు బాది ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్‌ను అత్యుత్తమ జట్టులో ఓపెనర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది.

అతనికి జతగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డక్కెట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. గతేడాది టెస్ట్‌ల్లో బెన్ డక్కెట్ 1149 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్‌ను చోటు దక్కించుకున్నాడు. గతేడాది కేన్ మామ 9 టెస్ట్‌ల్లో 59.58 సగటుతో 1013 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్‌కు చోటు దక్కింది. జోరూట్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1556 పరుగులు చేశాడు.

జడేజా, బుమ్రాకు చోటు..
ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌‌ను ఐసీసీ ఎంపిక చేసింది. బ్రూక్ 12 టెస్ట్‌ల్లో 55 సగటుతో 1100 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్ ఎంపికవ్వగా.. వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ జేమీ స్మిత్‌కు చోటు దక్కింది. కామిందు మెండిస్ 9 టెస్ట్‌ల్లో 74.92 సగటుతో 1049 పరుగులు చేయగా.. జేమీ స్మిత్ 9 మ్యాచ్‌ల్లో 637 పరుగులు నమోదు చేశాడు.

స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో 29.27 సగటుతో 527 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ 48 వికెట్లు పడగొట్టాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ ఎంపికవ్వగా.. స్పెషలిస్ట్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మ్యాట్ హెన్రీ చోటు దక్కించుకున్నాడు.

కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్..
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 జట్టుకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతేడాది ప్యాట్ కమిన్స్ 37 వికెట్లు తీయడంతో పాటు 25.53 సగటుతో 306 పరుగులు చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే అతను 32 వికెట్లు పడగొట్టాడు. గతేడాది మ్యాట్ హెన్రీ 48 వికెట్లు తీసాడు.

ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024:
యశస్వి జైస్వాల్, బెన్ డక్కెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కామిందు మెండీస్, జేమీ స్మిత్(కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Friday, January 24, 2025, 16:18 [IST]
Other articles published on Jan 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+