Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2022: అత్యుత్తమ జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కరు లేరు!

ICC announces team of Women’s World Cup 2022

దుబాయ్: ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జట్టును ప్రకటించింది. ఈ వివరాలను సోమవారం వెల్లడించింది. అయితే ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ ప్లేయర్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురి ప్లేయర్లకు చోటు దక్కగా.. సౌతాఫ్రికా నుంచి ఇద్దరు ప్లేయర్స్‌కు అవకాశం లభించింది.

మహిళల ప్రపంచకప్‌-2022లో భారత జట్టు లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్‌ క్రికెటర్‌లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నీలో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్‌ మూనీకు చోటు దక్కింది.

ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్‌కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్‌కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది.

ఐసీసీ అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్‌ కీపర్‌) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), చార్లీ డీన్ (ఇంగ్లండ్)

Story first published: Monday, April 4, 2022, 16:51 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+