Womens T20 World Cup 2024: భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ రీషెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. మొత్తం 23 మ్యాచ్‌ల వివరాలను సోమవారం వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. వాస్తవానికి బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఐసీసీ.. దుబాయ్‌కి తరలించింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ఆధ్వర్యంలోనే ఈ టోర్నీ జరగనుంది.
మొత్తం 10 జట్లను రెండు గ్రూప్స్‌గా విభజించారు. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక.. గ్రూప్-బీలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అక్టోబర్ 6న దుబాయ్ వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది.అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
అక్టోబర్ 17, 18న సెమీఫైనల్స్ జరగనుండగా.. అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది. ఈ నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్‌డే ఉంది. ఒకవేళ భారత్ సెమీస్ చేరితో తొలి సెమీఫైనల్ ఆడనుంది. మొత్తం 23 మ్యాచ్‌లను దుబాయ్, షార్జాలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగ్గా.. ఆస్ట్రేలియా ఏకంగా ఆరుసార్లు విజేతగా నిలిచింది. 2020లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications