న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Under-19 World Cup క్వాలిఫికేషన్ రీషెడ్యూల్.. 5 స్థానాలు 33 జట్లు!

ICC announces rescheduled Under-19 World Cup qualification path

దుబాయ్‌: వెస్టిండీస్ వేదికగా 2022లో జరిగే అండర్‌- 19 వరల్డ్‌క్‌ప క్వాలిఫికేషన్‌ రీషెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఏడాదికి పైగా ఆలస్యమైన ఈ క్వాలిఫికేషన్ టోర్నీ 2021 జూన్‌లో మొదలు కానుంది. ఈ ప్రపంచకప్‌లో 16 దేశాలు పాల్గొననున్నాయి. అయితే 2020 ఈవెంట్‌లో టాప్‌-11 స్థానాల్లో నిలిచిన ఆతిథ్య వెస్టిండీస్‌తోపాటు అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వేలు 2022 వరల్డ్‌క్‌పనకు నేరుగా అర్హత సాధించాయి.

మిగతా ఐదు బెర్త్‌ల కోసం ఏడు రీజినల్‌ ఈవెంట్‌ల నుంచి 33 జట్లు పోటీపడనున్నాయి. కరోనా కారణంగా క్వాలిఫికేషన్‌ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కాగా.. వచ్చే జూన్‌ నుంచి ఈ ఈవెంట్‌లు జరగనున్నాయి. జట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆఫ్రికా, ఆసియా రీజియన్ల నుంచి డబుల్‌ డివిజన్‌-2 క్వాలిఫికేషన్‌ ఈవెంట్లు నిర్వహించనుండగా.. మిగతా మూడు రీజియన్ల నుంచి అమెరికా, ఈఏపీ (ఈస్ట్‌ ఏషియా, పసిఫిక్‌), ఐరోపా నుంచి డివిజన్‌-1 క్వాలిఫికేషన్‌ ఈవెంట్లు జరపనున్నారు.

ఒక్కో రీజినల్‌ ఈవెంట్లలో విజేతకు ఒక్కో బెర్త్‌ ఖరారు కానుంది. ఆఫ్రికా, ఐరోపా, ఈఏపీ, అమెరికా, ఆసియా క్వాలిఫికేషన్‌ ఈవెంట్లకు నైజీరియా, స్కాట్లాండ్‌, జపాన్‌, అమెరికా, యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక అండర్-19 మెగా ఈవెంట్ ద్వారా భవిష్యత్తు సూపర్ స్టార్లు వెలుగులోకి వస్తారని ఐసీసీ హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లీ పేర్కొన్నారు.

Story first published: Monday, December 14, 2020, 9:37 [IST]
Other articles published on Dec 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X