WTC Final నిబంధనలు ఇవే.. రిజర్వ్‌డే ఉంది కానీ..!

దుబాయ్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఈ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు అంటే ఏమాత్రం బాగుండదని, సాధ్యమైనంత వరకు ఫలితం కోసం ప్రయత్నించాలని ఐసీసీ భావిస్తుందని ప్రచారం జరిగినా.. నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ముందుగా ప్రకటించినా నిబంధనలకే ఐసీసీ కట్టుబడింది. మ్యాచ్ డ్రా లేదా టై అయినా సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించుకుంది.

రిజర్వ్‌డే ఉంది.. కానీ
ఇక రిజర్వ్‌డేను కేటాయించిన ఐసీసీ.. ఆట ఐదో రోజు చివరి గంటలో దీనిపై మ్యాచ్ అఫిషయల్స్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఫలితం తేలలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ డేతో సంబంధం లేకుండా మ్యాచ్‌ను డ్రాగా పరిగణించనున్నారు. అలా కాని పక్షంలో రోజుకు ఎన్ని ఓవర్లు తక్కువయ్యాయో వాటిని రిజర్వ్‌డే రోజున ఆడించనున్నారు. గతంలో కూడా ఇవే నిబంధనలను పేర్కొన్న ఐసీసీ ఇటీవల వాటిని తొలగించడంతో మరిన్ని కొత్త నిబంధనలను తీసుకొస్తుందని అంతా భావించారు. కానీ ఎలాంటి మార్పులు చేయని ఐసీసీ కేవలం రిజర్వ్ డే విషయంలో చిన్న మెలిక పెట్టింది.

డ్యూక్ బాల్స్..
ఈ టైటిల్‌పోరులో గ్రేడ్ 1 డ్యూక్ బాల్స్ వాడనున్నారు. మాములుగా టెస్ట్‌లకు భారత్.. ఎస్‌జీ బంతులు వాడుతుంటే న్యూజిలాండ్ కోకబుర్రాను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ఈ మెగా పోరుకు మరో మూడు రూల్స్‌ను కూడాపెట్టింది. షార్ట్ రన్‌పై టీవీ అంపైరే నిర్ణయం తీసుకోనున్నాడు. ఆటోమెటిక్‌గా పరీక్షించి తదుపరి బంతిలోపు తన నిర్ణయాన్నిప్రకటించనున్నాడు. ఇక రివ్యూ తీసుకునే సమయంలో ఫీల్డింగ్ కెప్టెన్ లేదా బ్యాట్స్‌మన్ అంపైర్‌తో ధృవీకరించుకొని సమీక్ష కోరవచ్చు. ఎల్బీ డబ్ల్యూ రివ్యూ విషయంలో అంపైర్స్ కాల్స్ నిబంధనల్లో స్వల్ప మార్పులు జరిగియి.

భారత్ రెడీ..
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సమాయత్తం అవుతోంది. ఈ టైటిల్ కోసం జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్లు.. జూన్ 2న విమానం ఎక్కబోతోన్నారు. మూడురోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. అటు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం కసరత్తు పూర్తి చేసింది. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా ఉన్న అన్ని జట్ల మధ్య జరిగిన ఈ మెగా టోర్నీలో అత్యధిక పాయింట్ల సాధించిన టీమిండియా, కివీస్ జట్లు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications