ఐసీసీ సరికొత్త అవార్డు.. ఇకపై ప్రతి నెలా ఆటగాళ్లకు, అభిమానులకు పండగే!!

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఇకపై ప్రతినెలా 'ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు' ఇవ్వనుంది. ఏడాది పొడవునా అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనకారులకు ఐసీసీ ఈ అవార్డులు ఇవ్వనుంది. ఐసీసీ ఓటింగ్ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నట్లు పేర్కొంది.

ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ మాజీ ఆటగాళ్ళు, ప్రసారకులు, జర్నలిస్టులతో కూడిన స్వతంత్ర ఓటింగ్ అకాడమీ.. అభిమానులతో కలిసి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం ఓటు వేసి నిర్ణయిస్తారు. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సంవత్సరమంతా అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనలను పండుగలా జరుపుకునే గొప్ప మార్గంగా భావిస్తున్నాం' అని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్ అన్నారు.

నెలలో ప్రతి రెండవ సోమవారం:
మూడు ఫార్మాట్లలోనిప్రతి క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో సాధించిన విజయాల ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్‌లో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఐసీసీ డిజిటల్ ఛానెళ్లలో నెలలో ప్రతి రెండవ సోమవారం విజేతలను ప్రకటిస్తారు. ఇకపై ప్రతినెలా ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా పండగే అనే చెప్పాలి.

భారత్ నుంచి నలుగురు:
జనవరి నెలలో పలు సంచలనాత్మక క్రికెట్ ప్రదర్శనలు నమోదయ్యాయి. సరికొత్త అవార్డు కేటగిరీలో జనవరి నెలకుగానూ భారత్ నుంచి నలుగురు క్రికెటర్ల పేర్లు ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్‌తో పాటు రవిచంద్ర అశ్విన్ పేర్లను పరిశీలిస్తోంది. రెహమనుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), జో రూట్ (ఇంగ్లాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), మారిజనే క్యాప్ (దక్షిణాఫ్రికా), డిక్లార్క్ (దక్షిణాఫ్రికా), నిడా దార్ (పాకిస్తాన్) వంటి ఆటగాళ్లు ఈ అవార్డు కోసం జనవరి నెలలో పోటీకి సిద్ధంగా ఉన్నారు.
సిక్సర్ కోసం ఎలాంటి ప్లాన్ వేయలేదు.. బయటకి వచ్చి బాదానంతే! అర్ధ శతకం పూరైంది: శార్దూల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications