Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC ODI Team Of The Year 2024: భారత ఆటగాడు ఒక్కడు లేడు!

గతేడాది వన్డే క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 పేరిట ఈ జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జట్టులో ఒక్క భారత ఆటగాడు లేడు. భారతే కాకుండా టాప్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాల ఆటగాళ్లకు చోటు దక్కలేదు.

ICC Announces ODI Team Of The Year 2024 No Indian Player Finds Spot

లంకు నుంచే ఎక్కువ..
శ్రీలంక నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు.. పాకిస్థాన్ నుంచి ముగ్గురు, అఫ్గానిస్థాన్ నుంచి మరో ముగ్గురు ఆటగాళ్లు ఈ అత్యుత్తమ వన్డే టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్‌ ననుంచి ష్రెఫెన్ రూథర్‌పోర్డ్ ఒక్కడే ఎంపికయ్యాడు.

టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో గతేడాది భారత్‌తో సహా ప్రధాన టీమ్స్.. ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడలేదు. దాంతో ప్రధాన జట్ల ఆటగాళ్లు అత్యుత్తమ వన్డే టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు.

పాక్ నుంచి ముగ్గురు..
పాకిస్థాన్ నుంచి సయీమ్ ఆయుబ్, షాహిన్ షా అఫ్రిది, హ్యారీ రౌఫ్ ఎంపికవ్వగా.. శ్రీలంక నుంచి పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్, చరిత్ అసలంక, వానిందు హసరంగాలు చోటు దక్కించుకున్నారు. అఫ్గానిస్థాన్ నుంచి రెహ్మానుల్లా గుర్బాజ్ ఓపెనర్‌గా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, గజన్‌ఫర్‌ ఎంపికయ్యారు.

ICC Announces ODI Team Of The Year 2024 No Indian Player Finds Spot

భారత్ ఒక్క మ్యాచ్ గెలవలేదు..
గతేడాది టీమిండియా కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా శ్రీలంక గడ్డపై జరిగింది. ఈ సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 11 వన్డేలు ఆడగా 4 మాత్రమే గెలిచింది. అయితే ఈ సిరీస్‌ల్లో సీనియర్లు కాకుండా యువ క్రికెటర్లు బరిలోకి దిగారు.

బంగ్లాదేశ్ 9 మ్యాచ్‌లు ఆడగా.. ఇంగ్లండ్ 8 మ్యాచ్‌లే ఆడింది. పాకిస్థాన్ 9 మ్యాచ్‌లు ఆడి 7 గెలిచింది. అత్యధికంగా శ్రీలంక 18 మ్యాచ్‌లు ఆడి 12 గెలిచింది. దాంతో ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో శ్రీలంక ఆటగాళ్లు ఎక్కువగా ఎంపికయ్యారు. న్యూజిలాండ్ మూడు వన్డేలు మాత్రమే 2 ఓడింది. సౌతాఫ్రికా 9 వన్డేలు ఆడి 3 మాత్రమే గెలిచింది. అఫ్గానిస్థాన్ 14 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది.

Story first published: Friday, January 24, 2025, 13:57 [IST]
Other articles published on Jan 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+