Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఏంటంటే?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ నిరంతరం రూల్స్‌ను రివ్యూ చేస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు రూల్స్ మారుస్తుంది. తాజాగా కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఆ నిబంధన ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్టంపింగ్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంప్ ఔట్ కోసం మాత్రమే చెక్ చేయనున్నారు.

గతంలో స్టంపౌట్ కోసం ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరితే క్యాచ్ ఔట్‌ను కూడా సమీక్షించేవారు. ఇలా చేయడం వల్ల డీఆర్‌ఎస్ తీసుకోకుండా ఫీల్డింగ్ జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందనే విమర్శలు రావడంతో... ఐసీసీ ఈ రూల్‌లో మార్పు చేసింది. ఒక వేళ క్యాచ్ ఔట్‌పై ఏమైనా సందేహం ఉంటే ఫీల్డింగ్ జట్టు డీఆర్‌ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది.

ICC announces new rule, no caught behind check in stumping review

కంకషన్ రూల్‌లో మార్పు:
ఇక కంకషన్ రూల్‌లోనూ ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది. ప్లేయర్‌ తలకు గాయమైనప్పుడు కంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద మరో ఆటగాడిని అనమతిస్తారు. అలా వచ్చిన ఆటగాడు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయవచ్చు. అయితే కంకషన్ గురైన ఆటగాడు బౌలింగ్ నిషేధానికి గురైతే.. సబ్‌స్టిట్ట్యూట్‌గా వచ్చే ప్లేయర్‌కు కూడా బౌలింగ్ చేసే అవకాశం ఉండకుండా ఐసీసీ రూల్ మార్చింది.

నో బాల్ రూల్.. టైమ్ లిమిట్..
అన్ని రకాల ఫుట్ నోబాల్స్‌ను థర్డ్ అంపైరే సమీక్షించాలి. రిట్నర్ క్రీజ్‌ను టచ్ చేసి బౌలింగ్ చేసినా నోబాల్‌గా ప్రకటిస్తారు. అంతేకాకుండా మైదానంలో గాయపడిన ఆటగాడికి వైద్యం అదించే సమయానికి ఐసీసీ టైమ్ లిమిట్ పెట్టింది. వైద్య సాయం కోసం నాలుగు నిమిషాల వరకు సమయం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Story first published: Thursday, January 4, 2024, 21:42 [IST]
Other articles published on Jan 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+