Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024 ప్రైజ్‌మనీ రూ. 100 కోట్లు!

టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. టైటిల్ గెలిచిన జట్టుకు రూ. 20.36 కోట్ల క్యాష్ రివార్డ్ లభించనుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యధికం.

రన్నరప్‌ టీమ్‌కు రూ. 10.64 కోట్లు, సెమీస్‌లో ఓడిన జట్లకు రూ. 6.55 కోట్ల చొప్పున ఐసీసీ క్యాష్ ప్రైజ్ అందజేయనుంది. సూపర్ 8కు అర్హత సాధించిన జట్లకు రూ. 3.18 కోట్లు, 9-12 స్థానాల్లో నిలిచిన టీమ్స్‌కు రూ. 2.06 కోట్లు, 13-20 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 1.87 కోట్లు దక్కనుంది.

ICC Announces Highest Ever Prize Money For T20 World Cup 2024

అలాగే ఈ టోర్నీలో సాధించిన ఒక్కో విజయానికి రూ. 25.9 లక్షలు బోనస్‌గా ఇవ్వనున్నారు. ఇలా మొత్తం రూ. 93.52 కోట్లను ఐసీసీ ప్రైజ్‌మనీగా పంచిపెట్టనుంది. దాదాపు రూ. 100 కోట్లను ఐసీసీ ప్రైజ్‌మనీగా ఇవ్వడం ఇదే తొలిసారి.

ఆదివారమే టీ20 ప్రపంచకప్ 2024 తెరలేవనుండగా.. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సారి ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాలు పోటీ పడుతున్నాయి. లీగ్ స్టేజ్‌లో నాలుగు గ్రూప్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8 చేరిన జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇరు గ్రూప్స్‌ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు జూన్ 29న బార్డబోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి.

టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. గ్రూప్-ఏ మ్యాచ్‌లన్నింటికీ అమెరికానే ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లు భిన్నసమయాల్లో ప్రారంభం కానున్నాయి. కానీ భారత్ మ్యాచ్‌లు మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడ స్థానిక కాలమాన ప్రకారం కొన్ని ఉదయం 9.30 గంటలకు, కొన్ని ఉదయం 10.30 గంటలకు మొదలైనా మన టైమింగ్స్‌లో మాత్రం రాత్రి 8 గంటలకే.

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌‌లు
గ్రూప్‌-ఎ: భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా
గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌
గ్రూప్‌-సి: అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్‌
గ్రూప్‌-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

టీమిండియా షెడ్యూల్
జూన్ 5: భారత్ వర్సెస్ ఐర్లాండ్, న్యూయార్క్ - రాత్రి 8 గంటలకు
జూన్ 9: భారత్ వర్సెస్ పాకిస్థాన్, న్యూయార్క్ - రాత్రి 8 గంటలకు
జూన్ 12: భారత్ వర్సెస్ అమెరికా, న్యూయార్క్ - రాత్రి 8 గంటలకు
జూన్ 15: భారత్ వర్సెస్ కెనడా, ఫ్లోరిడా - రాత్రి 8 గంటలకు

Story first published: Monday, June 3, 2024, 23:00 [IST]
Other articles published on Jun 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+