Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS సెమీఫైనల్ మ్యాచ్ అంపైర్లు ఎవరంటే..? ఆ ఐరెన్ లెగ్ అయితే లేడు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా కీలక సమరానికి సిద్దమైంది. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచిన టీమిండియా అదే జోరులో ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌‌కు చేరాలనుకుంటోంది. మరోవైపు ఆసీస్ సైతం టీమిండియాను ఓడించాలనే కసితో ఉంది.

ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫిషయల్స్ జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అంపైర్లుగా వ్యవహరించనున్నారు. మూడో అంపైర్‌గా మైకేల్ గాఫ్ .. నాలుగో అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ICC Announce Match Officials For IND vs AUS Semifinal No Richard Kettleborough

ఐరెన్ లెగ్ అంపైర్ లేడు...
ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిచర్డ్ కెటిల్ బరో.. టీమిండియాకు ఐరెన్ లెగ్ అంపైర్‌గా మారిపోయాడు. ఎందుకంటే కెటిల్ బరో అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కెటిల్ బరో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. భారత్ ఓటమిపాలైంది. కానీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో రిచర్డ్ మామ టీవీ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. టీమిండియా విజయం సాధించింది.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్-1 అంపైర్లు:

ఆన్-ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్‌వర్హ్

మూడో అంపైర్: మైఖేల్ గోఫ్

నాలుగో అంపైర్: అడ్రియన్ హోల్డ్‌స్టాక్

మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్

సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్-2 అంపైర్లు:

ఆన్-ఫీల్డ్ అంపైర్లు: కుమార్ ధర్మసేన, పాల్ రీఫిల్

థర్డ్ అంపైర్: జోయెల్ విల్సన్

ఫోర్త్ అంపైర్: అహ్సన్ రజా

మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లె

Story first published: Monday, March 3, 2025, 19:35 [IST]
Other articles published on Mar 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+