For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాలోనే అశ్విన్ చుక్కలు చూపించాడు: ఇయాన్ చాపెల్

Ian Chappell Says ‘I Don’t Think You Can Come And Replicate What Ashwin And Jadeja Do’

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాలోనే అశ్విన్ సత్తా చాటాడని, అతనో అద్భుతమైన స్పిన్నరని కొనియాడాడు. అశ్విన్ అంత నైపుణ్యం రవీంద్ర జడేజాకు లేకున్నా.. అతను భారత్ పిచ్‌లకు సరిగ్గా సరిపోయే బౌలరని తెలిపాడు. ఈ భారత స్పిన్ ద్వయాన్ని అనుకరించేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారని, అందరూ విజయవంతం కాలేరని ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు.

31 వికెట్లు అశ్విన్-జడేజాకే..

31 వికెట్లు అశ్విన్-జడేజాకే..

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింట్లోనూ ఆసీస్‌పై భారత్ విజయం సాధించింది.

జడేజా-అశ్విని నాలుగు ఇన్నింగ్స్‌ల్లోని 40 వికెట్లలో 31 వికెట్లను తమ ఖాతాలో వేసుకోని ఆసీస్ పతనాన్ని శాసించారు. మరోవైపు ఆస్ట్రేలియాకు నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, మ్యాట్ కుహ్నెమన్ వంటి స్పిన్నర్లు ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో భారత స్పిన్నర్లను కొనియాడుతూ ఇయాన్ ఛాపెల్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

అశ్విన్ సూపర్ స్పిన్నర్..

అశ్విన్ సూపర్ స్పిన్నర్..

'సాధారణంగానే ప్రత్యర్థి బౌలర్లు.. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా బౌలింగ్‌ నైపుణ్యాలను అనుకరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, భారత్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది జడేజా-అశ్విన్ ద్వయానికి పూర్తిగా తెలుసు. ముఖ్యంగా అశ్విన్‌కు పిచ్‌ ఎలా ఉన్నాసరే.. అద్భుతంగా బౌలింగ్‌ చేయగల సత్తా ఉంది. ఆస్ట్రేలియాలోనే అతను ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఉత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు. ఫలితం ఎలా రాబట్టాలి.. ఏం చేయాలనేదానిపై స్పష్టత ఉన్న ఏకైక స్పిన్ బౌలర్‌ అశ్విన్. రవీంద్ర జడేజా మరీ అంత నైపుణ్యం కలిగిన బౌలర్‌ కాకపోయినా.. భారత పిచ్‌లకు తగ్గ స్పిన్నర్. ఎప్పటికప్పుడు తన స్కిల్స్‌ను మెరుగుపర్చుకునే వ్యక్తి. వీరిద్దరూ కలిసి కలిసి భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారు.

అశ్విన్‌ను లయన్ అనుకరించవద్దు..

అశ్విన్‌ను లయన్ అనుకరించవద్దు..

ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్ నాథన్ లయన్‌ తన శైలినే ఫాలో కావాలి. భారత్‌ పిచ్‌ల్లో అశ్విన్‌ మాదిరిగా బౌలింగ్‌ చేయాలని ప్రయత్నించడం ఏమాత్రం సరైంది కాదు. లయన్ బౌలింగ్ నైపుణ్యాలకు అశ్విన్ అనుకరించడం సరిపోదు. ఢిల్లీ టెస్ట్‌లో అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసినా.. జడేజాకు ఏడు వికెట్లు దక్కాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుండటం సహజం. అందుకే అశ్విన్‌లా బంతులను వేయడానికి ప్రయత్నించకుండా.. నాథన్ లయన్ తన శైలిలోనే బౌలింగ్‌ చేయాలి'అని ఇయాన్‌ ఛాపెల్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 23, 2023, 13:44 [IST]
Other articles published on Feb 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+