
ఇంగ్లండ్ బలహీనతలను గుర్తించింది
తాజాగా ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ బలహీనతలను టీమిండియా సమర్థవంతంగా గుర్తించింది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మానసికంగా భయపడతారని ఊహించి, అది తమకు లాభంగా మార్చుకుంది. భారత స్పిన్‌ను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ విశ్వాసంతో డిఫెన్స్ చేయలేకపోయారు. భయంతోనే ధాటిగా ఆడలేకపోయారు. బౌలర్ తన లెంగ్త్‌ను మార్చడానికి రివర్స్ స్వీప్ షాట్లు ఆడటం మంచిదే. అయితే టెక్నిక్స్‌తో కాకుండా షాట్లు ఆడి ఎదుర్కోవడం తక్కువ ప్రమాదకరం ఎలా అవుతుంది?' అని అన్నారు.

పోప్ ఆడాలనుకున్న ఆలోచన బాగుంది
స్పిన్‌ను ఫుట్‌వర్క్‌తో ఎదుర్కోవాలని, అలా చేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవడమేగాక కావాల్సిన ప్రదేశాల్లో షాట్లు ఆడొచ్చని ఇయాన్ ఛాపెల్ తెలిపారు. అయితే ఈ నైపుణ్యాన్ని బ్యాట్స్‌మన్ చిన్నతనంలోనే సంపాదించాలన్నారు. ఇంగ్లండ్ ఇలాంటివి ఎందుకు నేర్పించలేకపోతుందని ప్రశ్నించారు. స్పిన్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఓలి పోప్ ఆడాలనుకున్న ఆలోచన బాగుందని, కానీ దాన్ని విజయవంతం చేయలేకపోయాడన్నారు. మ్యాచ్ మరీ రెండు రోజుల్లోపే ముగియడం పట్ల కొంత మంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

మార్చి 4న ప్రారంభం
డేనైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా.. భారత్ 145 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో మార్చి 4న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు.
ISL 2020 21: హైదరాబాద్ ఎఫ్సీకి షాక్.. సెమీస్‌కు గోవా ఎఫ్‌సీ!!


Click it and Unblock the Notifications












