విండీస్ వీరుడు ఇయాన్ బిషప్ దశాబ్దపు వన్డే జట్టు.. కెప్టెన్ మనోడే!

న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ఆటగాళ్లంతా ఇంటికేపరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫాంటసీ క్రికెట్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ ఆల్‌టైమ్ బెస్ట్ టీమ్స్ ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసారు.
తాజాగా వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్ దశాబ్దపు వన్డే జట్టును ప్రకటించాడు. క్రిక్‌బజ్ వేదికగా భారత ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లేతో చిట్‌చాట్ చేసిన ఈ విండీస్ వీరుడు 11 మంది సభ్యులతో దశాబ్దపు అత్యుత్తమ జట్టును ప్రకటించాడు.

కెప్టెన్‌గా ధోనీ..
ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిన ఈ కామెంటేటర్ కమ్ క్రికెటర్.. ఈ జట్టు సారథిగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఎంపిక చేశాడు. కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను మాత్రం విస్మరించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? ఆ జట్టులో వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు.

ఓపెనర్లుగా వార్నర్-రోహిత్
2019 ప్రపంచకప్‌లో పరుగుల మోత మోగించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్‌లను ఓపెనర్లుగా తీసుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న విరాట్ కోహ్లీని మూడో స్థానంలో.. సౌతాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ను నాలుగో స్థానంలో ఎంపిక చేశాడు. మూడు పదుల వయసులో కూడా నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను ఐదో స్థానంలో తీసుకున్నాడు.ఇక బుకీలు సంప్రదించిన విషయాన్ని దాచి నిషేదానికి గురైన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌ను ఆల్‌రౌండర్‌గా ఆరో స్థానంలో ఎంపిక చేశాడు.

బుమ్రా స్థానంలో మలింగా..
భారత్‌కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించడంతో పాటు టెస్ట్ క్రికెట్‌లో అగ్రస్థానాన్ని అందించిన ధోనీని ఏడో స్థానంలో తీసుకున్నాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్, దక్షిణా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టేయిన్, శ్రీలంక పేసర్ లసిత్ మలింగతో పేస్ దళాన్ని ఎంచుకున్నాడు. అయితే మలింగా, బుమ్రాలో ఎవరిని తీసుకోవాలనేదానిపై డైలామాలో ఉన్నట్లు తెలిపిన ఈ విండీస్ వీరుడు చివరకు మలింగానే ఎంచుకున్నాడు. ప్రొఫెషనల్ స్పిన్నర్‌గా అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్‌కు తీసుకున్నాడు.

ఇయాన్ బిషప్ దశాబ్దాపు వన్డేటీమ్
రోహిత్ శర్మ (భారత్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (భారత్), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications