Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాపై ఒత్తిడి చేస్తే క్రికెట్ నుంచి తప్పుకుంటా: విరాట్ కోహ్లీ (వీడియో)

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా నేడు(జూలై 19) జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌కు ఇది డిసైడర్ మ్యాచ్ కాగా.. భారత్ అభిమానుల కళ్లన్నీ ఈ మ్యాచ్ కోసమే ఎదురు చూస్తున్నాయి.

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే చివరి మ్యాచ్ అంటూ జరిగిన ప్రచారం అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చినా రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు చర్చంతా రోహిత్ శర్మ రిటైర్మెంట్ చుట్టూనే జరుగుతోంది.

గంభీర్‌తో తీవ్ర వాగ్వాదం.. టీమిండియా హోటల్‌ నుంచి వెళ్లిపోయిన కోహ్లీ!(వీడియో)

గంభీర్‌తో తీవ్ర వాగ్వాదం.. టీమిండియా హోటల్‌ నుంచి వెళ్లిపోయిన కోహ్లీ!(వీడియో)

కోహ్లీ పాత వీడియో వైరల్..

ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా భారత సెలెక్టర్లను ఉద్దేశించి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తన గౌరవానికి భంగం కలిగినా.. తనను తాను నిరూపించుకునే పరిస్థితి వచ్చినా వెంటనే క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఆ ఇంటర్వ్యూలో కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితులకు అతని మాటలు సింక్ అవుతుండటంతో అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. రోహిత్ శర్మను తప్పుకునేలా చేస్తే కోహ్లీ కూడా జట్టుకు దూరమవుతాడని హెచ్చరిస్తున్నారు.

I Won t Keep Proving Myself Again and Again Virat Kohli Old Video Surface Amid Rohit Retirement Rumours
Photo Credit: X (twitter)

ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నా దృక్పథం చాలా క్లియర్‌గా ఉంటుంది. జట్టుకు విలువ తీసుకొస్తానని అనుకుంటే భాగమవుతా. జట్టుకు ఉపయోగమని భావిస్తే నన్ను గుర్తించినట్లు అవుతుంది. అలా కాకుండా ప్రతీసారి నన్ను నేను నిరూపించుకోవాలంటే మాత్రం క్రికెట్‌ను వదిలేస్తా. నా ప్రిపరేషన్, కమిట్‌మెంట్ విషయంలో అత్యంత నిజాయితీగా వ్యవహరిస్తా.

రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ: పాక్ మాజీ క్రికెటర్ వార్నింగ్

రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ: పాక్ మాజీ క్రికెటర్ వార్నింగ్

తప్పుకోవడానికి వెనుకాడను..

ఆటలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో చాలా నిజాయితీగా ఉంటా. అందుకోసం తీవ్రంగా కష్టపడతా. కష్టపడే విషయంలో నేనెవరికీ తక్కువ కాదు. వన్డేల్లో 40 ఓవర్ల పాటు ఈ బౌండరీ నుంచి ఆ బౌండరీ లైన్ వరకూ పరుగెత్తమని చెప్పండి. ఎలాంటి ఫిర్యాదు లేకుండా పరుగెత్తుతా. 50 ఓవర్లలో ప్రతీ బంతి కూడా నాకు చివరిదే అన్నట్లు భావిస్తా. జట్టు కోసం నా సాయశక్తులా కృషి చేస్తా. ఇవన్నీ చేసినా.. నా స్థానం కోసం నిరూపించుకోవాలంటే మాత్రం ఆటను వదిలేస్తా. నేను సిరీస్‌కు మూడు వారాల ముందు సన్నదమయ్యే వక్తిని కాదు. ఏడాదంతా రెడీగా ఉంటా.

భారత్ తరపున వరల్డ్ కప్ ఆడటం ఎప్పుడూ అద్భుతమే. కానీ ఆ ప్రయాణం ఇరువైపుల నుంచి గౌరవప్రదంగా ఉండాలి. నాకు ఆట అంటే ఇష్టం. అందుకే కొనసాగుతున్నాను. ఒకవేళ పరిస్థితులను సంక్లిష్టంగా మార్చాలని చూస్తే, నేను తప్పుకోవడానికి వెనుకాడను'అని బీసీసీఐతో పాటు సెలెక్టర్లకు కోహ్లీ తన సందేశాన్ని పంపాడు.

Story first published: Sunday, July 19, 2026, 6:55 [IST]
Other articles published on Jul 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+