రోహిత్ శర్మ వారసుడిగా అతనికి మాత్రమే అర్హత - టీమిండియా కాబోయే కేప్టెన్‌పై జోస్యం..!!

'సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన తదుపరి మ్యాచ్ కోసం సమాయాత్తమౌతోంది. సూపర్ 12లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన తరువాత ఇక నెదర్లాండ్స్‌పై సునామీల విరుచుకుపడటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నెల 27వ తేదీన నెదర్లాండ్స్‌తో తలపడబోతోంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వచ్చేసింది కూడా. ప్రాక్టీస్ సెషన్‌లో తలమునకలై ఉంటోంది.

నెదర్లాండ్స్‌తో..
ఆ రోజున మొత్తంగా మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి.. టీ20 ప్రపంచకప్‌లో. భారత్- నెదర్లాండ్స్‌తో పాటు దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్, పాకిస్తాన్ - జింబాబ్వేతో మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్ దశను దాటుకుని సూపర్ 12లో అడుగు పెట్టింది నెదర్లాండ్స్. సోమవారమే తొలి మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్‌ను ఎదుర్కొంది. ఫలితం మాత్రం నెదర్లాండ్స్‌కు అనుకూలంగా రాలేదు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిందా జట్టు. దక్షిణాఫ్రికాతో తలపడిన జింబాబ్వే ఓటమి కోరల నుంచి అనూహ్యంగా బయటపడింది. వర్షం రావడంతో ఫలితం రాలేదు.

రోహిత్ సారథ్యంలో..
రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రస్థానం ప్రస్తుతానికి సాఫీగా సాగిపోతోంది. ఇంకో మూడు మ్యాచ్‌లు కాస్త గట్టిగా ఆడగలిగితే సెమీ ఫైనల్స్ బెర్త్‌ను కన్‌ఫర్మ్ చేసుకుంటుంది. ఈ మూడింట్లోనూ ప్రత్యర్థుల నుంచి పెద్దగా ప్రతిఘటనను ఎదుర్కొనకపోవచ్చు భారత్. పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంలో రోహిత్ శర్మ వేసిన వ్యూహాలు- ఆ జట్టును 159 పరుగులకే పరిమితం చేయడానికి తీసుకున్న నిర్ణయాలపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు.

హార్దిక్‌పై..
రోహిత్ శర్మ సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోగలిగాడని వ్యాఖ్యానించాడు. టీమిండియాలో మళ్లీ ఈ స్థాయి నాయకత్వ లక్షణాలు, వేగంగా నిర్ణయాలను తీసుకుని- వాటిని అంతే వేగంగా అమలు చేయగల శక్తి సామర్థ్యాలు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఉన్నాయని వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎదుగుతాడనడంలో సందేహాలు అక్కర్లేదని చెప్పాడు. రోహిత్ శర్మ తరువాతి కేప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అపాయింట్ అవుతాడని జోస్యం చెప్పాడు.

నాయకత్వ లక్షణాలు అతనిలో..
పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి హార్దిక్ పాండ్యా 113 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడని గుర్తు చేశాడు. కోహ్లీతో కలిసి స్ట్రైక్‌ను రొటేట్ చేయడం తనను ఆకట్టుకుందని, అదే అతనిలోని నాయకత్వ లక్షణాలను బయటపెట్టిందని వకార్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో తొలి సారిగా హార్దిక్ పాండ్యా కేప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించాడని, తాను ప్రాతినిథ్యాన్ని వహించిన గుజరాత్ లయన్స్ ఫ్రాంఛైజీని ఛాంపియన్‌గా నిలబెట్టాడని గుర్తుచేశారు.

బెస్ట్ ఫినిషర్..
హార్దిక్ పాండ్యాకు బెస్ట్ ఫినిషర్‌గా పేరుందని, మానసికంగా దృఢంగా, తనపై తనకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడే అలాంటి గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించాడు. ఓ జట్టుకు సారథిగా పగ్గాలను అందుకోవడానికి అంతకంటే కావాల్సిన అర్హతలు లేవని చెప్పాడు. మిస్బా ఉల్ హక్, ఇంజమామ్ ఉల్ హక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీమిండియాకు తరువాతి కేప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను అపాయింటయితే.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని హక్ వ్యాఖ్యానించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
క్వీన్ ఈజ్ బ్యాక్ - అందరూ తప్పుకోండమ్మా..!!