For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆడటానికి నన్ను నేను బలవంత పెట్టుకోను: విరాట్ కోహ్లీ (వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులోనే ఆటకు అల్విదా ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ తీరు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రవర్తన నచ్చకనే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని కొందరంటే.. అనుష్క శర్మ ఒత్తిడి కారణంగా వైదొలిగాడని మరికొందరు కామెంట్ చేశారు.

కానీ తన రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ మొదటి నుంచి క్లారిటీతో ఉన్నాడు. ఏ రోజు అయితే ఆటపై మక్కువ పోతుందో.. ఆ రోజే ఆట నుంచి తప్పుకుంటానని కోహ్లీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్' అనే షోలో‌నూ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

I will Stop Playing Won t Drag Myself Old Video Of Virat Kohli Surfaces After Test Retirement
Photo Credit: PTI

ఆడటానికి నన్ను నేను బలవంతం చేసుకోను
'నేను క్రికెట్ ఆడటానికి స్పూర్తి గెలుస్తూ ఉండటమే. ఏ రోజైతే ఆటపై ప్రేమ తగ్గిందని భావిస్తానో ఆ రోజు ఆట నుంచి తప్పుకుంటా. ఆడటానికి నన్ను నేను ఏ మాత్రం బలవంతం చేసుకోను. నా శరీరం ఎంత వరకు తీసుకోగలుగుతుందో అంత వరకే నన్ను నేను పరిమితం చేసుకుంటాను. ఏదో ఒక రోజు మైదానంలో నిలబడి.. అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాననే ఆలోచన వచ్చినా.. గెలవాలనే తపన, శక్తి లేకపోయినా నేను ఆడలేను. జట్టు కోసం నేను ఏమీ చేయలేని సమయంలో ఇక నేను ఆడటం ఆపేస్తాను'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ అపవాదు మూటగట్టుకోవడం ఇష్టం లేకనే..
గతేడాది ఐపీఎల్ సందర్భంగా కూడా తన రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'నా పని నేను పూర్తి చేశాక.. నేను వెళ్లిపోతాను. మీరు నన్ను కొంత కాలం చూడలేరు. ఆటలో నా సమయం ఉన్నంత వరకు ఏమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉంటాను.'అని చెప్పాడు. రికార్డుల కోసం ఆడుతున్నాడనే అపవాదు మూటగట్టుకోవడం ఇష్టం లేకనే కోహ్లీ ఆట నుంచి తప్పుకున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

2020 నుంచి కోహ్లీ తనకు తాను నిర్దేశించుకున్న అత్యున్నత ప్రమాణాలను అందుకోలేకపోయాడు. 2019 చివర్లో 55కి పైగా ఉన్న అతని టెస్ట్ బ్యాటింగ్ సగటు.. ఇప్పుడు 46.85కు పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు చేసిన కోహ్లీ.. మూడేళ్ల పాటు మూడంకెల స్కోర్ చేయలేదు. గతేడాది న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై విఫలమైన కోహ్లీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనూ తేలిపోయాడు. దాంతోనే ఆటకు వీడ్కోలు పలికాడు.

2027 వన్డే ప్రపంచకప్ ఆడుతాడా?
గతేడాదే టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తాజాగా టెస్ట్‌ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం అతను వన్డే ఫార్మాట్‌తో పాటు ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగనున్నాడు. వన్డే ప్రపంచకప్ జరగాడానికి మరో రెండేళ్లు ఉంది. అప్పటి వరకు కోహ్లీ కొనసాగుతాడా? అంటే అవునని చెప్పడం కష్టమే.

Story first published: Tuesday, May 13, 2025, 10:50 [IST]
Other articles published on May 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+