Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: అందుకే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వీడ్కోలు వీడియోలో లేను: డేవిడ్ వార్నర్

I wasnt asked to do it: David Warner responds on SRHs farewell video

దుబాయ్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఐపీఎల్ 2021లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్, ప్లేయర్స్ మారుతూ వచ్చినా.. విజయాలు మాత్రం వరించలేదు. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్‌.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

ఈ పరిస్థితి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎప్పుడూ రాలేదు. ఇదివరకు ఫ్రాంఛైజీ, పేరు మారకముందు.. డెక్కన్ ఛార్జెస్‌గా ఉన్న సమయంలో తొలి సీజన్‌లో (2008) ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్‌రైజర్స్‌ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కలిసిరాలేదు.

2021లో మాత్రం

2021లో మాత్రం

ఐపీఎల్ 2021లో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 8 మ్యాచుల్లో 107 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజనల్లో కంటే.. 2021లోనే అతి తక్కువ పరుగులు సాధించాడు. 2014 నుంచి 2020 వరకు 500 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తూ వచ్చిన డేవిడ్ భాయ్.. 2021లో మాత్రం ఫాంలో లేక తంటాలు పడ్డాడు. వార్నర్ కెప్టెన్సీలో మొదటి ఆరు మ్యాచులలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక విజయాన్ని మాత్రమే సాధించింది.

దాంతో కెప్టెన్‌గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్‌ను నియమించారు. కేన్ పగ్గాలు చేపట్టిన మొదటి మ్యాచులోనే వార్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోల్పోయాడు. కరోనా కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది. ఇక యూఏఈ లెగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో వార్నర్ ఆడాడు. అప్పుడు కూడా పరుగులు చేయలేకపోవడంతో ఆ తర్వాతి మ్యాచులలో చోటు కోల్పోయాడు.

సాధారణ ప్రేక్షకుడిలా

సాధారణ ప్రేక్షకుడిలా

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తొలి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ పట్ల ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్మెంట్ కఠినంగా వ్యవహరించింది. ముందుగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటివ్వలేదు. అంతేకాకుండా కనీసం డగౌట్లో (డగౌట్లో ఉండేందుకు జట్టులోని 18 మందికి స్థానం ఉంటుంది) కూడా అతడికి చోటివ్వలేదు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన లీగ్ చివరి మ్యాచులలో అయితే వార్నర్ ఓ సాధారణ ప్రేక్షకుడిలా మ్యాచ్ చూశాడు. ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్‌తో ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌‌కు కోపం తెప్పించింది.

శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఐపీఎల్ 2021 లీగ్ దశ ముగిసిన తర్వాత అభిమానుల కోసం వీడ్కోలు వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో వార్నర్ కనిపించలేదు. వార్నర్ లేకపోవడంపై ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

DC vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి! ఢిల్లీ జట్టులో ఒక మార్పు!!

ఎవరూ అడగలేదు

ఎవరూ అడగలేదు

ఓ ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమాని డేవిడ్ వార్నర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసి.. వీడ్కోలు వీడియోలో ఎందుకు లేరంటూ ప్రశ్నించాడు. అందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ కెప్టెన్ స్పందిస్తూ.. వీడియోలో మాట్లాడమని తనను ఎవరూ అడగలేదని పేర్కొన్నాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్‌కి ఐపీఎల్‌ టైటిల్‌కి అందించిన ఏకైక కెప్టెన్ వార్నర్. అలాంటి వార్నర్‌ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది.

ఇక వచ్చే సీజన్‌లో డేవిడ్ భాయ్ ఆరెంజ్‌ ఆర్మీకి దూరమవుతాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వార్నర్ చేసిన ఓ ట్వీట్ కూడా అందుకు బలం చేకూర్చింది. అయితే మెగా వేలానికి ముందు వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ విడుదల చేస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా సన్‌రైజర్స్ జట్టు ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌లో విఫలం కావడంతో.. మొత్తం జట్టును పునరుద్ధరించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫొటోలో నా చిత్రం లేదు

కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు చిత్రాన్ని పోస్ట్ చేసి సహాయక సిబ్బందికి మరియు ఆటగాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అయితే వార్నర్ పేరును మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. 'ఇది కఠినమైన సీజన్. చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఈ కుర్రాళ్లతో ఆడటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. జట్టు, సిబ్బంది మరియు ముఖ్యంగా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని కేన్ పేర్కొన్నాడు. కేన్ పోస్టుపై డేవిడ్ భాయ్ స్పందించాడు. 'మీరు పోస్ట్ చేసియాన్ ఫొటోలో నా చిత్రం లేదు. అయినా మన బంధం చాలా గట్టిగా ఉందని అనుకుంటున్నా' అని వార్నర్ ట్వీట్ చేశాడు.

Story first published: Sunday, October 10, 2021, 20:13 [IST]
Other articles published on Oct 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+