For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెటర్‌గానే కాదు మనిషిగా కూడా: పంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు

I want to improve as a cricketer and human being: Rishabh Pant

హైదరాబాద్: ప్రతి రోజు క్రికెటర్‌గానే కాకుండా మనిషిగా కూడా తాను మెరుగవుతున్నానని టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ తెలిపాడు. రెండు నెలలు పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమైన నేపథ్యంలో వెస్టిండిస్ పర్యటనలో రిషబ్ పంత్ ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ "ప్రతి మ్యాచ్ నాకు చాలా ముఖ్యమైందే. ఇది రాబోయే ఆరు నెలల గురించి కాదు. నా జీవితంలో ప్రతిరోజూ కీలకమైనదే. నేను క్రికెటర్‌గా... వ్యక్తిగా రెండింటినీ మెరుగు పరచుకోవాలని అనుకుంటున్నా. దాని కోసం ఎదురు చూస్తున్నా" అని అన్నాడు.

మూడో టీ20లో పంత్ హాఫ్ సెంచరీ

మూడో టీ20లో పంత్ హాఫ్ సెంచరీ

వన్డే సిరిస్‌కు ముందు జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి టీ20లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీనిపై పంత్ మాట్లాడుతూ "ఒక వ్యక్తిగా, నేను బరిలోకి దిగిన ప్రతిసారీ భారీ స్కోరు సాధించాలనుకుంటాను. కానీ, నేను క్రీజులోకి దిగిన తర్వాత దానిపై దృష్టి సారించడం లేదు. నేను సెట్ అయ్యాక ఔట్ అవుతున్నా. కాబట్టి, సాధారణ ఆట ఆడి... నా టీమ్‌తో మ్యాచ్‌లు గెలిచేందుకు సహాయపడాలని అనుకుంటున్నా" అని పంత్ తెలిపాడు.

ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా మార్గం సుగమం

l

మేము ప్రయోగాలు చేయడం లేదు

మేము ప్రయోగాలు చేయడం లేదు

ఇక, జట్టులోని ప్రతి ఒక్క అటగాడికీ జట్టు మేనేజ్‌మెంట్ సరైన్ అవకాశాలను కల్పించడంపై పంత్ "మేము ప్రయోగాలు చేయడం లేదు. జట్టులో ఉన్న అందరికీ అవకాశాలు కల్పిస్తున్నాం. జట్టులోని ప్రతి ఒక్కరికీ మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలవడంపై జట్టులో తమ తమ స్థానం పట్ల నమ్మకంగా ఉన్నారు" అని చెప్పుకొచ్చాడు.

లార్డ్స్ వేదికగా యాషెస్ రెండో టెస్టు: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి!

వరల్డ్‌కప్ నిష్క్రమణపై పంత్

వరల్డ్‌కప్ నిష్క్రమణపై పంత్

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌ సెమీస్ నిష్క్రమణపై కూడా పంత్ స్పందించాడు. "ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌ ఓటమి తర్వాత నిరాశ చెందాం. అయితే, మేమంతా ఫ్రొపేషనల్స్ క్రికెటర్లం కాబట్టి మేము అంత చెత్తగా ఆడలేదని తెలుసు. అది కేవలం 45 నిమిషాల చెడ్డ క్రికెట్ (న్యూజిలాండ్‌తో). మనం ఎక్కువ క్రికెట్ ఆడుతున్నప్పుడు, మనం నేర్చుకోవడంతో పాటు మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి" అని పంత్ తెలిపాడు.

Story first published: Wednesday, August 14, 2019, 12:56 [IST]
Other articles published on Aug 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+