Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB: క్వాంటిటీ కన్నా.. క్వాలిటీకే ప్రాధాన్యమిస్తా: విరాట్ కోహ్లీ

I want intensity in practice says RCB captain Virat Kohli tells team

షార్జా: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు గతవారమే క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ ప్రారంభయించాయి. ఐపీఎల్ 13వ సీజన్‌కు దాదాపు 10 రోజులు మాత్రమే ఉండడంతో అన్ని జట్లూ తీవ్రంగా కష్టపడుతున్నాయి. ప్రాక్టీస్ మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కూడా నెట్ సెషన్‌లలో చెమటోడ్చుతోంది. ఆటగాళ్లు నిత్యం ప్రాక్టీస్‌‌ చేస్తున్నారు.

క్వాంటిటీ కన్నా.. క్వాలిటీనే ముఖ్యం:

క్వాంటిటీ కన్నా.. క్వాలిటీనే ముఖ్యం:

ప్రాక్టీస్‌ విషయంపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సోమవారం బోల్డ్‌ డైరీస్‌తో మాట్లాడాడు. 'మైదానంలో తక్కువ సమయమే కష్టపడినా.. నేను ఆశించేది మెరుగైన సాధన. క్వాంటిటీ కన్నా.. నేను క్వాలిటీకే అధిక ప్రాధాన్యమిస్తా. రెండున్నర గంటలు పరుగెత్తి ఆటగాళ్లు అలిసిపోవడం కాదు నాకు కావాల్సింది. తక్కువ పని చేసినా.. కచ్చితమైన ఫలితం ఉండాలి. కష్టపడేటప్పుడు తీవ్రత ఉండాలి' అని విరాట్‌ కోహ్లీ చెప్పాడు.

ఆటగాళ్లలో కసి పెరిగింది:

ఆటగాళ్లలో కసి పెరిగింది:

షార్జా స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయడంపై విరాట్ కోహ్లీ స్పందింస్తూ... 'ఈ రోజు ప్రాక్టీస్‌ బాగా జరిగింది. కొద్ది రోజులుగా సాధన చేస్తుండడంతో ఆటగాళ్లలో కసి పెరిగింది. ఇప్పుడు అందరిలోనూ తీవ్రత కనిపిస్తోంది. సిబ్బంది సైతం మమ్మల్ని అలా ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల విశ్రాంతి తర్వాత ప్రాక్టీస్ చేయడం ప్రారంభించడంతో.. ఒకేసారి కాకుండా నెమ్మదిగా తీవ్రత పెరిగేలా కోచ్‌లు పర్యవేక్షిస్తున్నారు. బౌలింగ్‌ కోచ్‌ ఆడంగ్రిఫిత్‌ ఆధ్వర్యంలో బౌలర్లు బాగా సాధన‌ చేస్తున్నారు. వారిప్పటికే పరిస్థితులకు తగ్గట్టు అలవాటు పడిపోయారు. బౌలర్లు శారీరక దృఢత్వంపై దృష్టిసారించారు' అని కోహ్లీ చెప్పాడు.

 21న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీ:

21న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీ:

టోర్నీ దగ్గర పడుతుండడంతో ఇంకా ఎక్కువగా కష్టపడాలని, అందుకోసం ఆటగాళ్లు కూడా సిద్ధంగా ఉండాలని బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ సూచించాడు. సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. 20న దుబాయ్‌ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తలపడనున్నాయి. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు 21న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో దుబాయ్‌లో పోటీపడనుంది.

 పెద్ద లోటు అదే:

పెద్ద లోటు అదే:

ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్ గేల్, డేల్ ‌స్టెయిన్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అదే ఇప్పుడు కోహ్లీకి పెద్ద లోటు.

CSK: నైట్‌ ప్రాక్టీస్‌ సెషన్.. చమటోడుస్తున్న ఎంఎస్ ధోనీ (వీడియో)

Story first published: Monday, September 7, 2020, 20:28 [IST]
Other articles published on Sep 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+