నా గురించి జనాలకు తెలియదు: వైభవ్ సూర్యవంశీ
తాను 50 ఓవర్ల క్రికెట్‌ను చాలా ఆడానని, ఆ విషయం జనాలకు తెలియదని టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. శ్రీలంక గడ్డపై ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
11 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డ్‌ను నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ . శ్రీలంక ఆటగాడు కుశాల్య వీర రత్నే(12 బంతులు) 20 ఏళ్ల ముందు నెలకొల్పిన రికార్డ్‌ను వైభవ్ తాజా ఇన్నింగ్స్‌తో బద్దలు కొట్టాడు.
నా గురించి తెలియకనే విమర్శలు..
ఈ సంచలన ప్రదర్శనతో భారత్-ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు. అలాగే ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు.

'రికార్డ్ గురించి నాకు తెలియదు. దాని గురించి ఆలోచించ లేదు. నా ప్రణాళికలను మాత్రమే అమలు చేశా. తొలి 10 ఓవర్లలో ఎలా ఆడాలనుకున్నానో అదే చేసి చూపించా. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ సిరీస్ ఆరంభంలో నేను అనుకున్న విధంగా ఆడలేదు. కోచ్‌లతో మాట్లాడి.. రిథమ్‌ను అందుకొన్నా. నా తప్పిదాలను సరిదిద్దుకున్నా. నేను 50 ఓవర్ల క్రికెట్ చాలా ఆడా. ఆ విషయం ప్రజలకు తెలియదు. విభిన్న పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను తీసుకోవడం ఇష్టపడతా. ఇప్పుడు ఫైనల్లో మంచి ఇన్నింగ్స్ ఆడటం బాగుంది.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
భారత్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94) తృటిలో శతకం చేజారగా.. తిలక్ వర్మ(90 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
శ్రీలంక-ఏ బౌలర్లలో మహమ్మద్ షిరాజ్, సహన్ అరాచిగే, దులజ్ సముదితా తలో వికెట్ తీయగా.. కుగతాస్ మతులన్, రవిందు ఫెర్నాండో, వానుజ సాహన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం శ్రీలంక-ఏ 47.1 ఓవరల్లో 311 పరుగులకు ఆలౌటైంది. భారత్-ఏ బౌలర్లలో యశ్ ఠాకూర్(3/45), విప్రజ్ నిగమ్(3/60) మూడేసి వికెట్లు తీయగా.. అశోక్ శర్మ,తిలక్ వర్మ చెరో వికెట్ తీసారు. అనుకూల్ రాయ్(2/42) రెండు వికెట్లు దక్కాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications