ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గేది ఎవరో తెలుసా?

హైదరాబాద్: ఈ ఏడాది మే 30 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు ఈ ఏడాది వరల్డ్‌కప్ గెలిచే జట్లలో ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయని చెప్పగా... తాజాగా ఈ విశ్లేషణ జాబితాలోకి ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా చేరిపోయాడు. వన్డే వరల్డ్‌కప్‌ని ఎగురేసుకుపోయే జాబితాలో భారత్, ఇంగ్లండ్ జట్లు ముందు వరుసలో ఉన్నాయని షేన్ వార్న్ పేర్కొన్నాడు.

రెండు జట్లు హాట్ ఫేవరెట్స్‌గా
ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌కు హాట్ ఫేవరెట్స్‌గా బరిలో దిగుతున్నాయని చెప్పాడు. అయితే, ఆస్ట్రేలియాకు కూడా అవకాశాలు ఉన్నాయని అన్నాడు. అయితే తాను అనుకున్న జట్టుతో ఆసీస్ పోరుకు సిద్ధమైతే వరల్డ్‌కప్ టైటిల్ వేటలో ఫేవరేట్‌గా ఉంటుందని అన్నాడు.
20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున అనిల్ కుంబ్లే PERFECT 🔟 (ఫోటోలు)

వరల్డ్ కప్‌లో ఆడటం ఓ కల
"నా దృష్టిలో ప్రతి క్రికెటర్‌కూ వరల్డ్ కప్‌లో ఆడటం ఓ కల. అయితే ఆస్ట్రేలియా ఈ సారి ప్రపంచకప్ సాధిస్తుందని నమ్మకంగా ఉంది. నేను ఊహించిన జట్టే బరిలోకి దిగితే కప్ సాధించడం ఆస్ట్రేలియాకు పెద్ద కష్టం కాదు. ఆస్ట్రేలియాతో పాటు ఈసారి భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్లు కానున్నాయి" అని వార్న్ చెప్పుకొచ్చాడు.

గట్టిపోటీ ఇచ్చే జట్లివే
"ఈ రెండు గట్టిపోటీ ఇచ్చే జట్లే. ఇరు జట్లలోనూ మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా సెలక్టర్లు వారి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఆస్ట్రేలియా కప్ గెలవడానికి 100 శాతం అవకాశం ఉంది" అని షేన్ వార్న్ తెలిపాడు.ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ ఆతిథ్యం
టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications