20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున అనిల్ కుంబ్లే PERFECT 🔟 (ఫోటోలు)


హైదరాబాద్: ఫిబ్రవరి 7, 1999.. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఈరోజు భారత క్రికెట్ చరిత్రలోనే సంచలనం. చరిత్రాత్మక ఇన్నింగ్స్‌కు సాక్ష్యంగా నిలిచిన రోజు. అంతర్జాతీయ క్రికెట్‌లో కుంబ్లేను రెండో వాడిగా నిలిపిన రోజు. భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో పర్ఫెక్ట్ టెన్ సాధించింది ఈ రోజే. ఆ అద్భుతం జరిగి ఈరోజుతో 20 ఏళ్లు పూర్తయ్యాయి. తన స్పిన్ మాయాజాలంతో పాక్ బ్యాట్స్‌మెన్‌ను భారత జట్టు ఒకే ఒక్క బౌలర్ శాసించాడు. మొత్తం 26.3 ఓవర్లలో 74 పరుగులిచ్చి పదికి 10 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్ తర్వాత ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 1956లో జిమ్ లేకర్ పర్ఫెక్ట్ టెన్ సాధించాడు. ఆ తర్వాత 43 ఏళ్లకు కుంబ్లే మళ్లీ అలాంటి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో:
1999 జనవరి నెలలో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు రెండు టెస్టుల్లో తలపడింది. జనవరి 28 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో ప్రారంభమైంది.

భారీ లక్యాన్ని ముందుంచిన భారత్:
సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172కే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

పాక్ క్రికెటర్లు రెచ్చిపోయి ఆడటంతో:
రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 101 పరుగుల వద్ద షాహిద్ అఫ్రిదిని ఔట్ చేసి అనిల్ కుంబ్లే తన దండయాత్రను మొదలుపెట్టాడు.

చరిత్ర సృష్టించిన కుంబ్లే:
వరసపెట్టి వికెట్లు తీస్తూ 207 పరుగులకే పాక్‌ను కుప్పకూల్చాడు. భారత్‌కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. 10/74 గణాంకాలతో చరిత్ర సృష్టించాడు. కుంబ్లే సూపర్ ఇన్నింగ్స్‌లో మూడు ఎల్బీలు ఉండటం విశేషం. లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీలు అద్భుతమైన క్యాచ్‌లతో కుంబ్లే ఘనతలో భాగస్వామ్యులయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications