For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan:'పాకిస్తాన్ జట్టులో క్రికెటర్ల కన్నా.. రెజ్లర్లే ఎక్కువ! ఎందుకు ఆడుతున్నారో అర్ధమే కావట్లే

I see more wrestlers than cricketers: Aaqib Javed slams Pakistan T20I team
Fans roast Babar Azam's Pakistan after humiliating loss to England | Oneindia Telugu

ఇస్లామాబాద్: ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ వరుస పరాజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం కారణంగా మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కరోనా కేసులు నమోదవంతో ప్రధాన ఆటగాళ్లంతా క్వారంటైన్‌లోకి వెళ్లడంతో.. ఇంగ్లండ్ బీ టీమ్‌తో బరిలోకి దిగింది. ఏకంగా 9 మంది కొత్త ఆటగాళ్లు ఆ జట్టులోకి వచ్చారు. అయినా పటిష్ట పాకిస్తాన్ కనీస పోటీ ఇవ్వకుండానే ఓడిపోయింది. దీంతో మాజీలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాక్ మాజీ పేసర్‌ ఆఖిబ్‌ జావెద్‌ ఓ అడుగుముందుకేసి తమ టీ20 జట్టుపై విమర్శల వర్షం కురిపించాడు. పొట్టి ఫార్మాట్ జట్టులో క్రికెటర్ల కన్నా రెజర్లు ఎక్కువగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశాడు.

క్రికెటర్ల కన్నా.. రెజ్లర్లే ఎక్కువ

క్రికెటర్ల కన్నా.. రెజ్లర్లే ఎక్కువ

జియో న్యూస్ ఛానెల్‌లో ఆఖిబ్‌ జావెద్‌ మాట్లాడుతూ... పాకిస్తాన్ టీ20 జట్టులో ఏ స్థానంలో ఎవరు ఆడతారో, వారి పాత్రలేంటో తెలియడం లేదన్నాడు. సరైన ఎంపిక విధానం, ప్రణాళిక లేదని పీసీబీ సెలక్టర్లు, జట్టు యాజమాన్యాన్ని విమర్శించాడు. 'పాక్ టీ20 ప్లేయర్స్ ఎందుకు ఆడుతున్నారో?, ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారో వారికే తెలియదు. నాకైతే పాక్‌ టీ20 జట్టులో క్రికెటర్ల కన్నా.. రెజ్లర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో షర్జీల్‌ ఖాన్‌, ఆజమ్‌ ఖాన్‌, షోయబ్‌ మక్సూద్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు కలుగుతున్నాయి' అని ఆఖిబ్‌ జావెద్‌ అన్నాడు. గతంలో పాక్‌ అండర్‌-19 జట్టుకు ఆఖిబ్‌ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. సీనియర్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గానూ సేవలు అందించాడు.

Sri Lanka vs India: ఓపెనర్‌గా పృథ్వీ షా.. ఆ ఇద్దరికీ నిరాశే! రాజస్థాన్ యువ పేసర్ అరంగేట్రం! తుది జట్టు ఇదే!

ఇలాగేనా ముందుకెళ్లేది

ఇలాగేనా ముందుకెళ్లేది

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రదర్శనల ఆధారంగా షోయబ్‌ మాలిక్‌ను టీ20 జట్టులోకి ఎంపిక చేశారని ఆఖిబ్‌ జావెద్‌ విమర్శించాడు. అతడిని ఏ స్థానంలో ఆడించాలో వారికే అర్థం కావడం లేదన్నాడు. 'పాక్‌ జట్టును పరిశీలిస్తే.. ఒకే స్వభావం కలిగిన అనేక మంది ఒక స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇలాగేనా ముందుకు వెళ్లే పద్ధతి?. ఇంగ్లండ్‌ను జట్టును ఓసారి చూడండి. కొత్త ఆటగాళ్లతో ఆడినా ఒక దార్శనికతతో ముందుకు సాగింది. అన్ని పరిస్థితుల్లోనూ మంచి రన్‌రేట్‌ కొనసాగించింది. విజయాలు అందుకుంది. పటిష్ట పాక్ మాత్రం ఎక్కడా ఆకట్టుకోలేదు' అని ఫైర్ అయ్యాడు.

తొలి టీ20లో ఘన విజయం

తొలి టీ20లో ఘన విజయం

ఆఖిబ్‌ జావెద్‌ విమర్చించిన రోజే పాక్ టీ20లో ఘన విజయం అందుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో పాక్ 31 ర‌న్స్ తేడాతో నెగ్గింది. అంతేకాదు టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్ (232/6) అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అంతకుముందు పాక్ అత్యధిక స్కోర్ 205/3. ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

ఓపెనర్లు బాబర్‌ అజామ్‌ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్‌ 41 బంతుల్లో 63 పరుగులు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవ‌ర్ల‌లో 201 ర‌న్స్ చేసి ఆలౌటైంది. భారి టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆశాకిర‌ణంలా క‌నిపించాడు. 17 బంతుల్లో 50, 42 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చ‌రిత్ర‌లో ఇది కొత్త రికార్డు. 9 సిక్స‌ర్ల‌తో లివింగ్‌స్టోన్ 43 బంతుల్లో 106 ర‌న్స్ చేసి కీల‌క‌ద‌శ‌లో ఔట‌య్యాడు. దీంతో ఇంగ్లండ్ ఆశలు వదిలేసుకుంది.

Story first published: Saturday, July 17, 2021, 13:24 [IST]
Other articles published on Jul 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+