నేను అతని మాట మాత్రమే వింటాను: తిలక్ వర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని తిలక్ వర్మ మరోసారి చాటుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
201 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ వర్మ ఆఖరి వరకు క్రీజులో నిలబడి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. విన్నింగ్ సిక్సర్ కొట్టిన వెంటనే తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ డగౌట్ వైపు జెర్సీ నెంబర్ 45ని సైగ చేస్తూ.. తన పొట్టను చూపిస్తూ ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో తిలక్ వర్మ.. ఎవర్ని ఉద్దేశించి ఇలా చేశాడా? అనే విషయం ఎవరికి అర్థం కాలేదు. కానీ తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ఈ సంబరాలు చేసుకున్నాడు.
తిలక్‌ను చూసి నేర్చుకోవాలి..
ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా ఆ ఫ్రాంచైజీ పంచుకుంది. ఈ వీడియోలో రోహిత్ శర్మపై ఉన్న అభిమానాన్ని తిలక్ వర్మ మరోసారి చాటుకున్నాడు. ముంబై సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ మూర్తుజా హుస్సేన్‌తో రోహిత్, తిలక్ సరదాగా మాట్లాడారు.

తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శనను కొనియాడిన రోహిత్.. అతని ఆటను నిశితంగా పరిశీలించి తన బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాలని సరదాగా అన్నాడు. అంతేకాకుండా తన వ్యక్తిగత ప్రదర్శనపై కూడా వ్యంగ్యంగా సంధించాడు. క్రీజులో బంతిని సరిగ్గా అంచనా వేయలేక ఇబ్బంది పడ్డానని, తిలక్ మాత్రం అద్భుతంగా ఆడాడని చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ మాట మాత్రమే వింటాను..
మరోవైపు తిలక్ వర్మ మాత్రం రోహిత్ శర్మను ఆకాశానికెత్తాడు. తాను ఎప్పుడూ రోహిత్ శర్మ మాట మాత్రమే వింటానని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులే చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలుపొందింది . తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications