Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: లవర్ బాయ్ శుభ్‌మన్ గిల్‌కు లేడీ ఫ్యాన్ ప్రపోజ్!

భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్, సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్‌కు ఓ లేడీ ఫ్యాన్ ప్రపోజ్ చేసింది. 'ఐ లవ్ యూ శుభ్‌మన్' అనే ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తూ సిగ్గుపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెండో రోజు ఆట‌లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రపోజ్‌పై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. లవర్ బాయ్ శుభ్‌మన్ గిల్‌కు ప్రపోజ్ చేయకుండా? ఎవరైనా ఉంటారా? అని ఒకరంటే.. సారా టెండూల్కర్‌కు తెలిస్తే ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని కొడుతుందని మరొకరు సెటైర్లు పేల్చుతున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇలా ప్రేక్షకుల నుంచి ప్రపోజల్స్ వచ్చేవి. అతని స్థానాన్నిభర్తీ చేసిన గిల్.. పరుగుల మోతతో పాటు అమ్మాయిల మనసులను కూడా గెలుచుకున్నాడు.

I Love You Shubman Gill Viral Mystery Girl s Proposal at IND vs WI 2nd Test
Photo Credit: X (twitter)

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్‌ ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరు కావడం, ఈ ఇద్దరూ సీక్రెట్‌గా కలుసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. కానీ వీరి ప్రేమాయణం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో సారా అలీ ఖాన్‌తో కూడా గిల్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను క్రికెట్‌తో తప్పా ఎవరితోనూ రిలేషన్‌లో లేనని పేర్కొన్నాడు.

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో 700 ప్లస్ రన్స్ చేసిన గిల్.. వెస్టిండీస్‌తోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో సెంచరీ బాదిన గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంనియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక శతకాల‌తో పాటు పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.

I Love You Shubman Gill Viral Mystery Girl s Proposal at IND vs WI 2nd Test
Photo Credit: X(twitter)

ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్‌మన్ గిల్(196 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో చెలరేగారు. నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ధ్రువ్ జురెల్(79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, October 11, 2025, 16:02 [IST]
Other articles published on Oct 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+