శ్రీకాంత్.. నీ కన్నా ముందే 50 పరుగులు చేస్తా.. మాట నిలబెట్టుకున్న గవాస్కర్!!

ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకానొక సందర్భంలో తనతో చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడని మాజీ ఓపెనర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పారు. 1981లో భారతదేశం తరఫున అరంగేట్రం చేసిన చిక్కా.. తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించేవారు. మరోవైపు సన్నీ మాత్రం క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకునేవారు. చాలాసార్లు సన్నీ కంటే ముందే చిక్కానే అర్ధ శతకం చేసేవారు. అయితే ఏదో ఓసారి నేనే ముందుగా 50 పరుగులు చేస్తానని కృష్ణమాచారి శ్రీకాంత్‌తో సునీల్ గవాస్కర్ అన్నారట.

గవాస్కర్ గొప్ప కెప్టెన్:
తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో మాట్లాడుతూ... 'సునీల్ గవాస్కర్ గొప్ప కెప్టెన్. అతని సారథ్యంలో ఆడే అవకాశం నాకు దక్కింది. అంతేకాదు తనతో ఓపెనింగ్ భాగస్వామిగా ఆడే అదృష్టం కలిగింది. అదంతా దేవుడి దీవెన. అంతకుమించి ఏం కాదు' అని అన్నారు. సన్నీ, చిక్కా టీమిండియాకు 55 సార్లు ఓపెనింగ్ చేశారు. 30.54 సగటుతో 1680 పరుగులు సాధించారు. అందులో రెండు శతక భాగస్వామ్యాలు ఉండగా 11 అర్ధ శతకాలు ఉన్నాయి. సచిన్-గంగూలీ, ధావన్-రోహిత్, సచిన్-సెహ్వాగ్, సెహ్వాగ్-గంభీర్‌ల ఓపెనింగ్ భాగస్వామ్యాల తర్వాత వీరే అత్యుత్తమ జోడీ.

మాట నిలబెట్టుకున్నాడు:
'1987లో పాకిస్థాన్‌తో మద్రాస్ టెస్టు సందర్భంగా అతనితో నాకో మధుర జ్ఞాపకం ఉంది. అదే గవాస్కర్ చివరి సిరీస్. అతనెప్పుడూ నాతో ఒక మాట అంటుండేవాడు. అదేంటంటే.. 'చిక్కా.. ఏదో ఒక రోజు నీ కన్నా ముందే అర్థ శతకం సాధిస్తా' అనేవాడు. ఆ మాట మద్రాస్ టెస్టులోనే నిలబెట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో నేను సెంచరీ బాదా. కానీ నా కన్నా ఒక బంతి ముందే సన్నీ 50 పరుగులు పూర్తి చేశాడు. అలా తన మాటను నిలబెట్టుకోవడం నమ్మలేకపోయా. అది కూడా చెన్నై లాంటి పిచ్ మీద. అప్పుడు నాకు ఆశ్చర్యమేసింది. ఆ మ్యాచ్‌లో సన్నీ చాలా దూకుడుగా ఆడాడు. చివరకు 91 పరుగులు చేసి ఔటయ్యాడు' అని శ్రీకాంత్ చెప్పారు.

4 టెస్టులు, 13 వన్డేలకు సారథ్యం:
మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన కెరీర్‌లో మొత్తం భారత్ తరఫున 146 వన్డేలు ఆడి 4,091 పరుగులు చేయగా.. 43 టెస్టుల్లో 2,062
పరుగులు సాధించారు. రెండు ఫార్మాట్‌లలో కలిపి ఆరు శతకాలు చేశారు. అయితే కేవలం 4 టెస్టులు, 13 వన్డేలకు మాత్రమే శ్రీకాంత్ కెప్టెన్‌గా వ్యవహరించారు. శ్రీకాంత్ అగ్రెసివ్ బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. అగ్రెసివ్ కెప్టెన్ కూడా. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడు చీకా కెప్టెన్సీలో అరంగేట్రం చేశాడు. సచిన్‌ను శ్రీకాంత్ బాగా ప్రోత్సహించారు. చీకా ఇచ్చిన సహకారంతోనే అప్పుడు యుక్త వయసులో ఉన్న సచిన్‌లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అదే అతన్ని వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది.
తరానికి తగ్గట్టు ఆడేవాడిని.. టీ20 కోసం నా బ్యాటింగ్ మార్చుకునేవాడిని: గంగూలీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications