కళ్లద్దాలు పెట్టుకున్న ఆ అమ్మాయి బాగా నచ్చింది.. ఆమెతో డేట్‌కు వెళతా: గంగూలీ

కోల్‌కతా: ప్రస్తుతం 'జెండర్ స్వాప్' ఫేస్ యాప్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ అలరిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా మారితే ఎలా ఉంటారో చూపిస్తుంది. టీమిండియా క్రికెటర్లు ఈ యాప్‌ను ఉపయోగించి పలు ఫోటోలతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. తొలుత మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్.. ఓపెనర్ రోహిత్ శర్మ ఫొటోను జెండర్ స్వాప్‌లో మహిళల రూపంలో మార్చి ఇన్‌స్టాలో పోస్టు చేయగా వైరల్ అయింది. దీంతో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కూడా చహల్ మాదిరే అభిమానులను అలరించే ప్రయత్నం చేసారు.

ఎవరితో డేట్‌కు వెళతారు?:
సోమవారం మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుత భారత క్రికెటర్ల ఫొటోలు పంచుకోగా.. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గతంలో టీమిండియాకు ఆడిన వారి ఫొటోలు పంచుకున్నాడు. అంతేకాకుండా ఇందులో ఉన్న వారిలో ఎవరితో డేట్‌కు వెళతారు అని హర్భజన్ సరదాగా ప్రశ్నించారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్‌లు ఉన్నారు.

ఆమెతోనే డేట్‌కు వెళతా:
హర్భజన్ సింగ్ పోస్ట్‌పై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సరదాగా స్పందించారు. 'కళ్లద్దాలతో మధ్యలో ఉన్న అమ్మాయితో డేట్‌కు వెళతా' అని దాదా కామెంట్ చేశారు. మధ్యలో ఉన్న తన ఆడరూపమే నచ్చిందని దాదా చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం భజ్జీ చేసిన పోస్ట్, దాదా కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హర్భజన్ పోస్ట్‌పై పలువురు అభిమానులు కూడా తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు.

నా స్నేహితురాలిగా భువీని ఎంచుకుంటా:
అంతకుముందు యువీ పోస్టు చేసిన దానికి చాలా మంది భువనేశ్వర్‌కుమార్ ఫొటో నచ్చినట్లు కామెంట్లు చేశారు. అమ్మాయిగా భువీ చాలా అందరంగా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువీ పోస్టుకు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిప్లై ఇచ్చాడు. 'నా స్నేహితురాలిగా భువనేశ్వర్‌ను ఎంచుకుంటా' అని కామెంట్ చేసాడు. మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా భార్య రష్మా కూడా భువీకే ఓటేశారు. స్టైలిష్ లుక్‌లో ఆటగాళ్లంతా అమ్మాయిలుగా చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

రోహితా చూడటానికి అందంగా ఉన్నావు:
తాజాగా యజువేంద్ర చహాల్ కూడా 'జెండర్ స్వాప్' ఫేస్ యాప్ ద్వారా 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మను అమ్మాయిగా మార్చిన విషయం తెలిసిందే. మేల్, ఫిమేల్ వర్షన్ ఫొటోలను పక్కపక్కనే పెట్టి షేర్ చేశాడు. దీనికి 'రోహితా చూడటానికి చాలా అందంగా ఉన్నావు. లవ్‌యూ' అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక ఈ ట్వీట్‌కు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. రోహిత్ అమ్మాయిగా బాగున్నాడని కామెంట్ చేశారు. దీనిపై రోహిత్ కూడా సరదాగా స్పందించడం విశేషం.
View this post on InstagramWho do u wanna go on date😜😛 as @yuvisofficial asked yesterday
A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సీపీఎల్ 2020 నుంచి గేల్ ఔట్.. కారణం అదేనా?!!