అతన్ని బకరా చేసేందుకే ఔటైనట్లు నటించా: రోహిత్ శర్మ (వీడియో)
కుల్దీప్ యాదవ్‌ను ఆట పట్టించేందుకే తాను ఔటైనట్లు నటించానని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తెలిపాడు. డీఆర్‌ఎస్ విషయంలో కుల్దీప్ యాదవ్ తొందరపడుతాడనే విషయం తెలిసే ఇలా చేశానన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్‌లో రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి కీపర్ చేతిలో పడింది.
క్యాచ్ ఔట్ కోసం కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ గట్టిగా అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ ఔటైనట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ క్రీజును వీడుతున్నట్లు చేశాడు. దాంతో అక్షర్ పటేల్ రివ్యూ తీసుకోగా.. నాటౌట్ అని తేలింది. దాంతో రోహిత్ నవ్వుతూ మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అయితే ఆ మరుసటి ఓవర్‌లోనే అతను అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

పిచ్ కష్టంగా ఉంది..
తొలి ఇన్నింగ్స్ అనంతరం హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్ అందేజేశారు. ఈ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ.. కుల్దీప్ యాదవ్‌ను ఆట పట్టించేందుకే ఔటైనట్లు నటించానని వెల్లడించాడు. 'ఈ వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. ఈ వికెట్‌పై బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకోవాలి. ఆ తర్వాతే షాట్లు ఆడటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇక్కడ పరుగులు చేయడం అంత ఈజీ కాదు, కానీ మేం బోర్డుపై మంచి స్కోరునే ఉంచగలిగాం అని భావిస్తున్నా. పవర్‌ప్లే వారిని కట్టడి చేసి, ఆరంభంలోనే కొన్ని వికెట్లు తీయగలిగితే మ్యాచ్ మా నియంత్రణలోకి వస్తుంది.
తొలి ఇన్నింగ్స్‌లో షాట్లు ఆడటం అంత ఈజీగా లేదు. మా బౌలర్లు ఈ పరిస్థితులను ఉపయోగించుకోగలరు. మొదటి ఆరు ఓవర్లలో మేం వారిని ఒత్తిడిలోకి నెట్టగలిగితే.. మా స్పిన్నర్లు, సీమర్లు రంగంలోకి దిగి పట్టు బిగించగలరు. ఈ పిచ్ టూ పేస్డ్‌గా( బంతి వేర్వేరు వేగంతో వస్తోంది) ఉంది. కొత్త బంతితో కూడా పిచ్ నుంచి కొంత సహాయం లభిస్తోంది. నేను చెప్పినట్లుగా, లైన్‌కు తగ్గట్టుగా వరుసగా షాట్లు కొట్టడం ఇక్కడ కష్టం. బంతిని ఎటువైపు కొట్టాలో అర్థం చేసుకోవాలి. మా బౌలర్లు చాలా తెలివైన వారు. ఈ పరిస్థితులను వారు అనుకూలంగా మార్చుకుంటారని ఆశిస్తున్నా.
కుల్దీప్‌ను ఆటపట్టించడానికే..
నాకు కుల్దీప్ బాగా తెలుసు. అతనికి DRS తీసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను అక్కడ నా అదృష్టాన్ని కొంచెం పరీక్షించుకున్నాను (నవ్వుతూ). కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాతి ఓవర్‌లోనే నేను ఔట్ అయ్యాను. నేను ఆటను సాధ్యమైనంత చివరి వరకు తీసుకెళ్లాలనుకున్నాను. కానీ అది కుదరలేదు. మైదానంలో ఆటగాళ్లతో ఆ సమయం కాస్త సరదాగా గడిచింది. కులదీప్‌కు 50-50 అవకాశం ఉన్నా వెంటనే DRS అడుగుతాడు. అందుకే నేను అతడిని ఆటపట్టించడానికి అలా చేశాను. అది మాకు అనుకూలంగా మారింది. కానీ ఆ వెంటనే నేను అవుట్ అవ్వడం బాధాగా అనిపించింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ముంబై 162/6
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications