'ఉమేశ్ ఆ బాల్ వేస్తాడని ముందుగానే ఊహించా..'

హైదరాబాద్: భారత్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠగా ముగిసింది. ఆఖరి బంతి వరకూ సాగిన పోరాటం టైగా ఫలితాన్నిచ్చింది. విజయానికి ఆఖరి బంతికి 5 పరుగులు అవసరంకాగా.. ఉమేశ్ యాదవ్ విసిరిన బంతిని షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సులు) పాయింట్ దిశగా బౌండరీకి తరలించాడు.

చివరి బంతిని యార్కర్ రూపంలో ముందుగానే
సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న అంబటి రాయుడు.. ఆ బంతిని బౌండరీకి వెళ్లకుండా నిలువరించేందుకు డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. అయితే.. ఉమేశ్ యాదవ్ చివరి బంతిని యార్కర్ రూపంలో విసరబోతున్నట్లు తాను ముందుగానే ఊహించానని షై హోప్ వెల్లడించాడు.
విరాట్ అతి విశ్వాసమే టైగా ముగిసేలా చేసిందా??

ఉమేశ్ బంతిని ముందుగానే ఊహించా
‘ఆఖరి బంతిని ఉమేశ్ యాదవ్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా యార్కర్ రూపంలో విసురుతాడని నేను ముందుగానే ఊహించా. దీంతో.. ఆ బంతిని హిట్ చేసేందుకు.. బ్యాటింగ్ పొజిషన్ కూడా తీసుకున్నా. కానీ.. నేను ఆశించినట్లుగా హిట్ చేయలేకపోయా. అయినప్పటికీ.. బంతి బౌండరీకి వెళ్లి.. మ్యాచ్ టైగా ముగిసింది. అది చాలు'అని షై హోప్ వెల్లడించాడు.

వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో
మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది.

గర్వంగా ఉన్నా.. మ్యాచ్ గొప్పగా సాగింది
వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్ పట్ల, వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్నందుకు గర్వంగా ఉన్నా. మ్యాచ్ గొప్పగా సాగింది. విండీస్ చాలా బాగా ఆడింది. అదృష్టవశాత్తు మ్యాచ్‌ను టై చేసుకోగలిగాం. అంబటి రాయుడు చాలా బాగా ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications