Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాడి బ్యాటింగ్‌కు మాటలు రావడం లేదు: రిషభ్ పంత్

అనామక ప్లేయర్ ముకుల్ చౌదరి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. అతని అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నామని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో గురువారం కోల్‌కతా వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన లక్నో జట్టును.. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ముకుల్ చౌదరీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో గెలిపించాడు. 7 భారీ సిక్స్‌లు బాది అసాధ్యమనకున్న లక్నో విజయాన్ని సుసాధ్యం చేశాడు.

I Have No Words Rishabh Pant Hails Mukul Chowdary s Heroic Match-Winning Performance Against KKR
Photo Credit: screen grab for JioHotstar

ఈ విజయానంతరం మాట్లాడిన రిషభ్ పంత్.. ముకుల్ చౌదరిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ముకుల్ చౌదరి గురించి చెప్పేందుకు నాకు మాటలు రావడం లేదు. అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. ఇలాంటి ప్రతి మ్యాచ్ కూడా జట్టులో ఏదో ఒక గొప్ప విషయం నిర్మితమవుతోందనే సంకేతాన్ని ఇస్తోంది. దాని గురించి ఎక్కువగా చెప్పం కానీ, లోపల ఏదో పెద్దదే జరుగుతోంది.

బదోని ఇప్పుడు మా జట్టులో సీనియర్ ప్లేయర్. అతనికి మేం ఇచ్చిన బాధ్యత అది. బదోని నుంచి మేం ఆశించే సహకారం ఇదే. షమీ కుర్రాడు కాదు. కానీ అతను జట్టుకు ఇచ్చే అనుభవం వెలకట్టలేనిది. అతని లాంటి ఆటగాడు జట్టులో ఉండటం అద్భుతం. బౌలింగ్ యూనిట్ అంతా బాగా రాణిస్తోంది'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. ముకుల్ చౌదరి‌తో పాటు ఆయుష్ బదోని(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/38), అనుకుల్ రాయ్(2/32) రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Friday, April 10, 2026, 0:46 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+