ఇషాంత్ శర్మకు పెద్ద అభిమానిని: బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడి

హైదరాబాద్: ఇషాంత్ శర్మకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ఓ పెద్ద అభిమాని ఉన్నాడు. ఇంతకీ ఎవరా అభిమాని అని అనుకుంటున్నారా? చాలా కాలంగా తాను ఇషాంత్‌కు పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా వెటరన్ బౌలర్ డేల్ స్టెయిన్. తాజాగా బీసీసీఐకి ఇచ్చిన ఓ ఇంటర్యూలో స్టెయిన్ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఇషాంత్‌కు పెద్ద అభిమానిని
"చాలా కాలంగా నేను ఇషాంత్‌కు పెద్ద అభిమానిని. అతడితో కలిసి సన్‌రైజర్స్ తరఫున ఆడా. అతడి సత్తా ఏంటో, ఏం చేయగలడో వీక్షించా. ఇషాంత్ దురదృష్టవంతుడని అనుకుంటాను. భారత్ స్వదేశంలో వరుసగా చాలా టెస్టులు ఆడింది. ఆ పిచ్‌లు పేసర్లకు అనుకూలించకపోవడం బాధాకరం" అని స్టెయిన్ అన్నాడు.
ఇషాంత్ తన దృష్టిని, ఫిట్‌నెస్‌ను పోగొట్టుకోలేదు
"టీమిండియా నిరంతరం స్పిన్నర్లపై ఆధారపడినా ఇషాంత్ తన దృష్టిని, ఫిట్‌నెస్‌ను పోగొట్టుకోలేదు. పేస్ బౌలర్లు అవసరమైనప్పుడల్లా ఇషాంత్ ముందుకొస్తాడు. ఇంగ్లిష్ సమ్మర్‌ను దృష్టిలో పెట్టుకొని ఇషాంత్ ముందే కౌంటీ క్రికెట్ ఆడినందుకు సంతోషంగా ఉంది" అని ఇషాంత్‌పై స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇంగ్లాండ్ పిచ్‌లపై చెలరేగుతున్న ఇషాంత్
కాగా, ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇషాంత్ శర్మ ఇంగ్లాండ్ పిచ్‌లపై చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు 15 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇషాంత్ శర్మ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. కౌంటీ క్రికెట్‌లో ఆడిన అనుభవంతో జట్టులోని మిగతా బౌలర్లకు సైతం సలహాలు ఇస్తున్నాడు.
India vs England, 5th Test: రిచర్డ్స్ రికార్డుని కోహ్లీ సమం చేసేనా?

ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఇషాంత్ శర్మ
కాగా, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఇషాంత్‌ను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీల్లో ఆడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ఆధ్వర్యంలో అతడు శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications