Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరే ఓ పాండే.. ఇక నేను ర్యాంప్ షాట్స్ ఆడొచ్చురా: విరాట్ కోహ్లీ(వీడియో)

తాను స్వేచ్ఛగా ర్యాంప్ షాట్స్ ఆడవచ్చని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. తాను ఇప్పుడు టీమిండియాకు ఆడటం లేదని, తన బ్యాటింగ్ టెక్నిక్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తూ విరాట్ కోహ్లీ అన్న ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. క్రీజులో షాడో ర్యాంప్ షాట్స్ ప్రాక్టీస్ చేస్తూ.. కేకేఆర్ ప్లేయర్ మనీష్ పాండేతో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాను మళ్ళీ భారత్ తరపున ఆడాలని అనుకోవడం లేదని పేర్కొంటూనే, తర్వాతి బంతికి 'ర్యాంప్ షాట్' ఆడబోతున్నానని చెప్పడం ఈ క్లిప్‌లో వినిపించింది.

శతక్కొట్టి..

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. కేకేఆర్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని సెంచరీ ధాటికి 193 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

అయితే మనీష్ పాండేతో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో ఎప్పుడూ ర్యాంప్ షాట్స్ ఆడని కోహ్లీ ఈ మధ్య ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలోనే అతను ఈ ర్యాంప్ షాట్స్ ఆడుతున్నట్లు అతని మాటలను బట్టి అర్దమవుతోంది.

I Don t Want to Play for India Again Virat Kohli Shocking Stump-Mic Remark to Manish Pandey Goes Viral

టెస్ట్ క్రికెట్ కోసం నో ర్యాంప్ షాట్స్..

గతంలో టెస్ట్ క్రికెట్‌ టెక్నిక్ దెబ్బతినకూడదనే ర్యాంప్ షాట్స్ ఆడటం లేదని కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ చేసిన అనంతరం మాట్లాడిన కోహ్లీ.. ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఉండటంతో తన టెక్నిక్‌‌కు కట్టుబడి ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. '

'నేను ఫ్యాన్సీ షాట్లు ఆడే వ్యక్తిని కాదు. ఏడాదిలో 12 నెలల పాటు ఆడుతూనే ఉండాలి. ఫ్యాన్సీ షాట్స్ ఆడి వికెట్ పారేసుకోవడం నాకు నచ్చదు. ఐపీఎల్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఉంది. నా టెక్నిక్‌కు కట్టుబడి ఉండాలి. కీలకమైన మ్యాచ్‌ల్లో ప్రభావం చూపినప్పుడు అది నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.’అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అతను ఆడిన 11 మ్యాచ్‌ల్లో 53.77 సగటుతో 484 పరుగులు చేసి టాప్-3 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, May 14, 2026, 18:16 [IST]
Other articles published on May 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+