For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియాతో ఆడితేనే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది.. కానీ ఆ అదృష్టం ఇప్పట్లోరాకపోవచ్చు'

I Don’t think India-Pakistan matches going to happen anytime soon-Junaid Khan

కరాచీ: టీమిండియాతో ఆడితేనే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుందని పాకిస్తాన్ ఫాస్ట్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. దాయాది జట్లపైన ఒత్తిడనేది చాలా ఉంటుందని, ఆ సమయంలోనే నేర్చుకోవడానికి ఎంతో ఉంటుందన్నాడు. భారత్, పాకిస్తాన్ జట్లు ఆడుతుంటే.. ఆ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుందన్నాడు. అయితే పరిస్థితులను చూస్తే సమీప భవిష్యత్‌లో ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగేలా అనిపించడం లేదని జునైద్‌ ఖాన్‌ అంచనా వేశాడు. పాక్ జట్టుకు జునైద్ ఖాన్ కీలక బౌలర్.. కానీ ప్రస్తుతం అతడు జట్టులో లేడు. పాకిస్తాన్ జట్టులో ఇప్పట్లో అతడికి అవకాశం దక్కడం కష్టమే.

ఒత్తిడిని ఎదుర్కోవాలంటే భారత్‌తో ఆడాలి

ఒత్తిడిని ఎదుర్కోవాలంటే భారత్‌తో ఆడాలి

జునైద్‌ ఖాన్‌ తాజాగా ఒక స్థానిక మీడియాతో మాట్లాడుతూ... 'పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే.. భారత జట్టుతో మ్యాచులు ఆడాలి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండు జట్లపైనా ఒత్తిడనేది చాలా ఉంటుంది. ఆ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా క్రికెట్ జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే సమీప భవిష్యత్‌లో అది జరిగేలా అనిపించడం లేదు' అని అన్నాడు. జునైద్‌ ఖాన్‌ పాక్ తరఫున 22 టెస్టులు,76 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు ఒకేసారి పడగొట్టాడు.

చాలా విషయాలు నేర్చుకున్నా

చాలా విషయాలు నేర్చుకున్నా

'నేను 2012-13లో భారత పర్యటనకు వెళ్లినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. అప్పుడే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. దాంతో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగితే ఇరు జట్ల ఆటగాళ్లకు చాలా మంచిది. అది రెండు దేశాల అభిమానులను సంతోషపెడుతుంది' అని జునైద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. చివరిసారి భారత్‌లో పర్యటించినప్పుడు పాకిస్థాన్‌ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌లో జునైద్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మూడు వన్డేల్లో విరాట్‌ కోహ్లీని అతడే ఔట్‌ చేయడం విశేషం. ఆ సిరీస్‌లో కోహ్లీ మొత్తం 13 పరుగులే చేశాడు. ఆ పర్యటన తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు.

England vs India: 11 ఏళ్ల తర్వాత.. రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత!!

ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు

ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది. ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిసారిగా తలపడ్డాయి. పాకిస్థాన్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కే మెరుగైన రికార్డ్‌ ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది.

టీమిండియాపై పాక్‌దే పైచేయి

టీమిండియాపై పాక్‌దే పైచేయి

మ్యాచ్‌ల పరంగ మాత్రం టీమిండియాపై పాక్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్‌లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా.. భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్‌లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా.. పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.

Story first published: Monday, July 12, 2021, 14:22 [IST]
Other articles published on Jul 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+