Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరైనా సీరియస్‌గా ఉంటే వెంటనే జోకులు వేస్తా: విరాట్ కోహ్లీ

Virat Kohli Talks About His Behaviour With Team
I don’t see myself as a senior cricketer, says Virat Kohli

హైదరాబాద్: టీమిండియాలో అందరితో కలివిడిగా ఉంటూ సరదా వాతావరణం సృష్టించడమే తనకు ఎంతో ఇష్టమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మంగళవారం తన వీడియో యాప్ విరాట్ కోహ్లీ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ జట్టులో తనను తాను సీనియర్‌గా భావించబోనని విరాట్‌ కోహ్లీ అన్నాడు.

 కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ "నిజంగా చెప్తున్నా. జట్టులో నేనోక సీనియర్‌లా ప్రవర్తించను. ఒక సీనియర్‌ క్రికెటర్‌లా ఉండటం నాకిష్టం ఉండదు. ఎవరైనా వచ్చి సీరియస్‌గా ఎక్కువ గౌరవంతో మాట్లాడితే వెంటనే జోకులు పేలుస్తా. అందరూ మనసు విప్పి మాట్లాడుకోనేలా చేయడం ఇష్టం" అని అన్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా పిలవలేదు: గవాస్కర్ లేకుండానే ట్రోఫీ ప్రదానం!

సోదరుడు వికాస్‌ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది

సోదరుడు వికాస్‌ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది

ఇక, తన జీవితంలో సోదరుడు వికాస్‌ కోహ్లీ పాత్ర ఎంతో ఉందని విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. "నా కన్నా వికాస్‌ ఏడేళ్లు పెద్ద. నాన్నతో కలిసి పని చేస్తుండేవాడు. తీరిక ఉండేది కాదు. అయినా నాకెప్పుడు మ్యాచ్‌ ఉన్నా తీసుకెళ్లేవాడు. ఆట చూసేవాడు. తిరిగి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఎదిగిన తర్వాత ఒంటరిగానే వెళ్లేవాడిని" అని కోహ్లీ అన్నాడు.

 ఆయన అంటే నాకెంతో ఇష్టం

ఆయన అంటే నాకెంతో ఇష్టం

"ఆయన అంటే నాకెంతో ఇష్టం. నా ఆట విషయంలో సర్దుకుపోయేవాడు కాదు. నా గురించి ఆయన ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నా కూడా అంతే. అన్నయ్యే ఎక్కువ చూసుకునేవాడు. చిన్నప్పుడు అన్నయ్య స్నేహితులతో కలిసి ఆడేవాడిని. ఫీల్డింగ్‌, బౌలింగ్‌ నాతో చేయించేవారు. నా బ్యాటింగ్‌ వచ్చినప్పుడు మాత్రం ఆట వదిలేసి వెళ్లిపోయేవారు. దీంతో ఏడుపొచ్చేది" అని కోహ్లీ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

Story first published: Wednesday, January 2, 2019, 10:48 [IST]
Other articles published on Jan 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+