Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏయ్! 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తా.. ఎవడయ్యా మీడియం పేసర్?: జస్‌ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అన్నివిధాల సిద్దమయ్యామని టీమిండియా తాత్కలిక టెస్ట్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. ఈ సిరీస్ నేపథ్యంలో చాలా ముందుగా వచ్చి ఇక్కడి పరిస్థితులను అలవాటు చేసుకున్నామని చెప్పాడు. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.

వ్యక్తిగత పనులతో తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో వైస్ కెప్టెన్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో బుమ్రా కెప్టెన్ హోదాలో గురువారం మీడియాతో మాట్లాడాడు. మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానమిచ్చాడు.

Jasprit Bumrah is all set to captain India in the first Test against Australia

ఎవడయ్యా మీడియం పేసర్..?
అయితే ఈ క్రమంలో ఓ రిపోర్టర్ బుమ్రాను మీడియమ్ పేస్ ఆల్‌రౌండర్ అని సంబోధించాడు. దాంతో బుమ్రా వెంటనే.. తాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తానని చెబుతూ నవ్వులు పూయించాడు. 'ఓ మీడియమ్ పేస్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకు సారథ్యం వహించడం ఎలా ఉంది?' అని సదరు రిపోర్టర్ అడిగాడు.

వెంటనే బుమ్రా..'యార్.. నేను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలను. కనీసం నువ్వు ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ అని పిలువు'అని బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. 'పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని నేను ఎప్పుడూ సమర్థిస్తాను. ఎందుకంటే వ్యూహాత్మకంగా పేసర్లు కెప్టెన్ అయితే ఎంతో నయం. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ అద్భుతమైన రీతిలో రాణిస్తున్నాడు. గతంలో కూడా చాలా మంది పేసర్లు కెప్టెన్లుగా సత్తా చాటారు.

అన్ని విధాల రెడీ..
ఈ సిరీస్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. ఎందుకంటే ఇక్కడికి మేం చాలా త్వరగా వచ్చాం. దాంతో వాకా మైదానంలో గడిపే అవకాశం దక్కింది. జట్టులోని చాలా మంది కుర్రాళ్లు తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చారు. కానీ మేం తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తుత సమయం కంటే చాలా తక్కువ సమయం లభించింది. కానీ సిరీస్ గెలిచాం.

మేం ఎప్పుడూ మాపై నమ్మకం ఉంచడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటాం. ఎక్కడ ఆడినా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉంటాం. సన్నాహకాల విషయానికి వస్తే మేం మెరుగైన స్థితిలోనే ఉన్నాం. ఈ సిరీస్‌లో రాణించడం అనేది మా మానసిక స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. మేం మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా.

అది నాకు బాగా తెలుసు..
కెప్టెన్‌గా.. బౌలర్‌గా నా బాధ్యతలను సమన్వయం చేసుకుంటాను. అదనపు బాధ్యతలను ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. మహమ్మద్ షమీ జట్టులో భాగంగానే ఉన్నాడు. అతను బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. షమీపై మేనేజ్‌మెంట్ ఓ కన్నేసి ఉంచింది. త్వరలోనే అతను ఆస్ట్రేలియా‌‌కు వచ్చే అవకాశం ఉంది.'అని జస్‌ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 21, 2024, 12:54 [IST]
Other articles published on Nov 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+