
ఒక్క బంతి చాలు
తాజాగా ఫస్ట్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెస్రిక్ విలియమ్స్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం కష్టం అనుకుంటున్నారా.. నాకైతే ఎంతమాత్రం కాదు. విరాట్ టాలెంటెడ్ ప్లేయర్.. కానీ అతడి గురించి నాకు ఎటువంటి ఆందోళన లేదు. కోహ్లీ జతువు ఉన్నాడనే ఆలోచనే ఎప్పుడు రాదు. చాలా మందికి విరాట్ ఉన్నాడంటే నిద్రపట్టకపోవచ్చు. నాకైతే అటువంటి భయం లేదు. హ్యాపీగా నిద్రపోతా. కోహ్లీని ఔట్ చేయడానికి నాకు ఒక్క బంతి చాలు' అని అన్నాడు.

కోహ్లీపై పైచేయి సాధించడమే నాకు తెలుసు
'టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పైచేయి సాధించడమే నాకు తెలిసిన విషయం. మైదానంలో ఆలోచిస్తాను. అతన్ని ఔట్ చేయడానికి ప్రతిఒక్క బౌలర్ చూస్తాడు, నేను అందులో ఒకడిని. కోహ్లీ వంటి దూకుడుగల ప్లేయర్‌కు సరైన పోటీ ఇవ్వకపోతే.. అప్పుడు అతని నుంచి భారీ స్కోర్లు వస్తాయి. నేను కోహ్లీకి గట్టి పోటీ ఇవ్వడానికే ఎప్పడూ సిద్ధంగా ఉంటా' అని విండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ తెలిపాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విలియమ్స్ ఇప్పటివరకు 8 వన్డేల్లో, 25 టీ20 మ్యాచ్‌ల్లో విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కోహ్లీ నోట్‌బుక్ సంబరాలు
2017 విండీస్ పర్యటనలో విరాట్ కోహ్లీని ఔట్ చేసిన కెస్రిక్ విలియమ్స్ నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. దీన్ని గుర్తు పెట్టుకున్న కోహ్లీ.. గతేడాది విండీస్ భారత పర్యటనకు రాగా.. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ20లో బదులిచ్చాడు. ఆ మ్యాచ్‌లో విలియమ్స్ బౌలింగ్‌ను టార్గెట్ చేసి మరి ఆడిన విరాట్.. అతని తలపై నుంచి నేరుగా ఓ బంతిని బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టి అదే నోట్ బుక్ స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సైగలు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లోనే 94 రన్స్‌తో జట్టును గెలిపించాడు.

బౌలర్‌గా నాకు అనవసరం
ఇక తిరువనంతపురం వేదికగా జరిగిన ఆ మరుసటి టీ20లోనే విలియమ్స్.. విరాట్‌ను ఔట్ చేశాడు. కానీ నోట్ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకోకుండా.. కొత్తగా నోటిపై వేలు వేసుకుంటూ నిశబ్ద సంబరాలు చేసుకున్నాడు. అయితే అప్పట్లో విరాట్‌కు విలియమ్స్ భయపడే అలా చేశాడని భారత అభిమానులు కామెంట్ చేశారు. గతంలో ఈ వ్యవహారంపై స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెస్రిక్ స్పందించాడు. 'కోహ్లీ ఎవరో నాకు అనవసరం. నైపుణ్యం కలిగిన ఆటగాడు కావచ్చు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్లేయర్ కూడా కావొచ్చు. కానీ బౌలర్‌గా నాకు అనవసరం' అని బదులిచ్చాడు.
RCB: 'ఐపీఎల్ లీగ్‌లో అత్యుత్తమ జట్టు మాదే అని చెప్పను.. కానీ చాలా తాజాగా అనిపిస్తోంది'


Click it and Unblock the Notifications
