Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫాస్ట్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్: ఏబీకి ఉన్న నైపుణ్యం తనకు లేదన్న కోహ్లీ

I am not skilled enough to play flamboyant shots like AB de Villiers: Virat Kohli

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్. మూడు ఫార్మాట్లలో కూడా వీరిద్దరూ అద్భుతమైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఎలాంటి పిచ్‌ మీదైనా, ఎలాంటి బౌలర్‌నైనా అలవోకగా ఎదుర్కొంటారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వీరిద్దరి స్నేహం మరింతగా బలపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వీరిద్దరూ రెండు పిల్లర్లు లాంటి వారు. ఇద్దరూ ఒకరిని మరొకరు పరస్పరం గౌరవించుకుంటారు.

రెండు రోజుల క్రితం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒకే ప్రాంఛైజీ తరుపున కోహ్లీ ఈ పరుగులు సాధించడం విశేషం. కోహ్లీ ఇప్పటి వరకు 5,043 పరుగులు నమోదు చేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచీ కోహ్లీ బెంగళూరు జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో డివిలియర్స్‌లా తాను అన్ని రకాల షాట్లు ఆడలేనని కోహ్లీ స్పష్టం చేశాడు. 'నేను అన్ని ఫార్మాట్లలోనూ ఆడతాను. కానీ ఏబీ డివిలియర్స్ ఆడే షాట్లు మాత్రం నా వల్ల కాదు. నాకు ఎలా ఆడటం తెలుసో అలాగే ఆడతాను. సంప్రదాయ షాట్లకే పరిమితమవుతాను' అని కోహ్లీ అన్నాడు.

సృజనాత్మక షాట్లు నాకు సాధ్యం కావు

సృజనాత్మక షాట్లు నాకు సాధ్యం కావు

'సృజనాత్మక షాట్లు నాకు సాధ్యం కావు. ఏబీ డివిలియర్స్ లాంటి వాళ్లకు అన్ని రకాల షాట్లూ ఆడే సామర్థ్యం ఉంది. నేను రక్షణాత్మకంగా ఆడతానని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. కానీ ఏబీ డివిలియర్స్ తరహా నైపుణ్యం నాకు లేదు. ఆ షాట్లను నేనెప్పుడూ సాధన కూడా చేయలేదు. ఫాస్ట్‌బౌలర్‌ బౌలింగ్‌లో బంతిని రివర్స్‌ స్వీప్‌ చేసి సిక్స్‌ బాదగల నైపుణ్యం ఏబీ సొంతం. నా జీవితంలో అలాంటి నైపుణ్యం ఎక్కడా చూడలేదు. ఇలాంటివే క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాయి' అని కోహ్లీ చెప్పాడు.

కోహ్లీపై డివిలియర్స్ ప్రశంసల వర్షం

కోహ్లీపై డివిలియర్స్ ప్రశంసల వర్షం

అదే సమయంలో ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'తనకు కొన్ని షాట్లు ఆడే నైపుణ్యం లేదని కోహ్లీ అంటాడు. కానీ 360 డిగ్రీల్లో షాట్లు ఆడేవాళ్లు విరాట్‌ కోహ్లీ తరహాలో అలవోకగా లాంగాన్‌, లాంగాఫ్‌లో సిక్సర్లు బాదలేరు. అందుకే వాళ్లు వేరే మార్గాలను అనుసరిస్తుంటారు' అని డివిలియర్స్ అన్నాడు.

ఆటపట్ల కోహ్లీకి ఉన్న అంకితభావమే ఇలా

ఆటపట్ల కోహ్లీకి ఉన్న అంకితభావమే ఇలా

'నిజానికి ఇలా వేరే మార్గాలను అనుసరించే వారు విరాట్‌ కోహ్లీ అంత గొప్ప బ్యాట్స్‌మన్‌ కాదని అర్థం. కోహ్లీకి వైవిధ్యమైన షాట్లు ఆడాల్సిన అవసరమే రాదు. పదిసార్లు ప్రయత్నిస్తే తొమ్మిదిసార్లు తాను అనుకున్న షాట్‌ ఆడగలడు' అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఆటపట్ల కోహ్లీకి ఉన్న అంకితభావమే అతడిని అత్యుత్తమ ఆటగాడిగా మార్చిందని ఏబీ అభిప్రాయపడ్డాడు.

ఆట కోసం అతనెంత కష్టపడతాడో నాకు తెలుసు

ఆట కోసం అతనెంత కష్టపడతాడో నాకు తెలుసు

'కోహ్లీ సాధిస్తున్న ఘనతలకు అతను పూర్తి అర్హుడు. ఆట కోసం అతనెంత కష్టపడతాడో నాకు తెలుసు. తన ఆరోగ్యంపై చాలా జాగ్రత్త వహిస్తాడు. ఎల్లపుడూ ఎంతో ఉత్సాహంతో ఉంటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడబోయే ముందు బౌచర్‌.. కోహ్లీ నైపుణ్యం గురించి చెప్పాడు. దీంతో నాకు కోహ్లీ ప్రదర్శనేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ప్రస్తుతం అతనే ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు' అని డివిలియర్స్‌ చెప్పాడు

Story first published: Thursday, April 19, 2018, 10:28 [IST]
Other articles published on Apr 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+