Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్‌తో రిలేషన్ గురించి అతియానే అడగండి : సునీల్ శెట్టి

‘I am not having the relationship. You’ll have to ask her’ – Suniel Shetty on daughter Athiya’s relationship with KL Rahul

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు.

అయితే తాజాగా రాహుల్-అతియా రిలేషన్‌షిప్ గురించి సునీల్ శెట్టిని ప్రశ్నించగా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'రాహుల్‌తో నాకు రిలేషన్ లేదు. ఈ ప్రశ్న అతియను అడగండి. అది నిజమైతే నాకు వచ్చి చెప్పండి, అప్పుడు దీని గురించి మాట్లాడుదాం. నీకేం తెలియనప్పుడు నన్నెలా అడుగుతావు'అని ఓ నేషనల్ చానెల్‌తో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక రాహుల్-అతియా న్యూ ఇయర్ వేడుకలు తమ ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్ వేదికగా జరుపుకున్నారని కూడా వార్తలు వినిపించాయి. కొన్ని రోజుల క్రితం రాహుల్ కూడా అథియాతో ఉన్న ఫోటో షేర్ చేశాడు. అతియా బర్తేడే సందర్భంగా విషెస్ కూడా తెలియజేశాడు. దీనికిస్పందించిన అతియా.. 'లవ్' గుర్తు ఎమోజీలను పోస్ట్ చేసింది. అతియా ఫ్రెండ్ ఒకరు కూడా రాహుల్,అతియా కలిసి ఉన్న ఫోట్ షేర్ చేయడం కూడా వీరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు బలం చేకూర్చింది.

ఇక క్రికెట్ కెరీర్ పరంగా రాహుల్ దూసుకుపోతున్నాడు. ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ న్యూజిలాండ్ గడ్డపై పరుగుల మోత మోగిస్తున్నాడు. అటు కీపింగ్.. ఇటు బ్యాటింగ్‌‌లో ఆర్డర్ సంబంధం లేకుండా చెలరేగుతున్నాడు. ఐదు టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న రాహుల్.. తొలి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Friday, February 7, 2020, 20:58 [IST]
Other articles published on Feb 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+