Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్ క్రికెట్ రీఎంట్రీ‌పై తేల్చేసిన విరాట్ కోహ్లీ!

అంతర్జాతీయ టెస్ట్‌‌ల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది ముగిసిన కథ అని తేల్చేసాడు. టెస్ట్ క్రికెట్‌లోకి పునరాగమనం చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. గతేడాది టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

విరాట్ కోహ్లీ భవితవ్యంపై ఆర్‌సీబీ కీలక ప్రకటన!

విరాట్ కోహ్లీ భవితవ్యంపై ఆర్‌సీబీ కీలక ప్రకటన!

తనకు ఎంతో ఇష్టమైన ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే కోహ్లీ రెడ్ బాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని ప్రచారం జరిగింది. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. దాంతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని విరాట్ కోహ్లీని పలువురు మాజీ క్రికెటర్లు అభిమానులు కోరారు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫిట్‌నెస్‌తో మరో 3 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడవచ్చని అభిప్రాయపడ్డారు.

I Am Done With It Virat Kohli Shuts Down Rumors of Reversing His Test Cricket Retirement

అది ముగిసిన కథ..

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీని ఇదే విషయంపై ప్రశ్నించగా రీఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ బ్రాండ్‌లోని ఓ షూ ధర విరాట్ కోహ్లీ చేసిన టెస్ట్ పరుగులతో(రూ.9,230) సమానంగా ఉంది.

ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా కమెడియన్ డానిష్ సైత్.. సరదాగా ఓ ప్రశ్న వేసాడు. 'టెస్ట్‌ల్లో ఇంకొన్ని పరుగులు చేసి..ఆ షూ లాభాలను పెంచొచ్చు కదా'అని విరాట్ కోహ్లీని అడిగాడు. 'నేను తక్కువ ధరకు అమ్మడానికే ఇష్టపడతాను. ఇక మీరు అడుగుతున్న దానితో(టెస్ట్ క్రికెట్) నా పని అయిపోయింది. ధన్యవాదాలు.'అని కోహ్లీ బదులిచ్చాడు. దాంతో టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఆసక్తి తనకు లేదని విరాట్ కోహ్లీ తేల్చేసాడు.

కోహ్లీ ఆడతాడా?: ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

కోహ్లీ ఆడతాడా?: ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

వారి ప్రేమతోనే..

ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 'నా జీవితం ఢిల్లీలోనే మొదలైంది. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే క్రికెటర్‌గా ఎదిగాను. అందుకే ఢిల్లీలో వన్8 బ్రాండ్‌ను ప్రారంభించాలని అనుకున్నా. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైనది. అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

తన 14 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 254 నాటౌట్ కాగా.. 7 డబుల్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Monday, June 22, 2026, 13:13 [IST]
Other articles published on Jun 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+