Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Syed Mushtaq Ali Trophy: హైదరాబాద్‌ ఖేల్‌ఖతమ్‌!

Hyderabad suffers third loss in Syed Mushtaq Ali Trophy

కోల్‌కతా: ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ కథ ముగిసింది. మరోసారి ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో తన్మయ్ అగర్వాల్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ 'బి'లో భాగంగా తమిళనాడుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఏడు వికెట్ల తేడాతో ఓడింది. ఈ పరాజయంతో హైదరాబాద్ నాకౌట్‌ చేరుకునే అవకాశాలకు తెరపడింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. బావనక సందీప్‌ (36 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... ఓపెనర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి (23 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో తన్మయ్‌ (6 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), సీవీ మిలింద్‌ (11 బంతుల్లో 24 నాటౌట్‌; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్‌ స్కోరు 150 దాటింది.

అనంతరం తమిళనాడు జట్టు 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌ జగదీశన్‌ (51 బంతు ల్లో 78 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (30 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించారు.
వరుసగా నాలుగో విజయం సాధించిన తమిళనాడు జట్టు ప్రస్తుతం గ్రూప్‌ 'బి'లో 16 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది. దాదాపుగా నాకౌట్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బెంగాల్‌ జట్టు 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ఇక నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించిన హైదరాబాద్‌ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో తమిళనాడు, బెంగాల్‌ తలపడనున్నాయి. ఒకవేళ తమిళనాడు ఓడిపోతే బెంగాల్‌ కూడా 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే బెంగాల్‌కంటే తమ నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటం తమిళనాడుకు కలిసొచ్చే అంశం. సోమవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది.

Story first published: Sunday, January 17, 2021, 8:27 [IST]
Other articles published on Jan 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+