ఉప్పల్ టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి.. పాసులు కావాలంటున్న పోలీసులు, మంత్రులు! కక్కలేక మింగలేక హెచ్‌సీఏ!

హైదరాబాద్: దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుండటంతో టికెట్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అన్నీ ఇప్పటికే అమ్ముడయిపోయాయి. గురువారం రాత్రి 8 గంటలకు పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో ఈ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంచగా.. క్షణాల్లో 39 వేల టికెట్లు అమ్ముడయిపోయాయి.
దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ పోరు జరుగుతుండటం.. అదీ ఆసీస్‌తో కావడంతో మ్యాచ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ టిక్కెట్ల కోసం విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు కాంప్లిమెంటరీ పాసుల కోసం అటు పోలీసులు.. ఇటు మంత్రులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారులను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.

క్షణాల్లో 39 వేల టికెట్లు మాయం..
ఉప్పల్ స్టేడియంలో చివరగా 2019 డిసెంబరు 6న అంతర్జాతీయ మ్యాచ్ (టీ20) నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. కొవిడ్ కారణంగా 2020, 2021, 2022 ఐపీఎల్ మ్యాచ్‌ల ఆతిథ్యం హైదరాబాద్‌కు దక్కలేదు. దాంతో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఆసక్తికనబరుస్తున్నారు. అయితే క్షణాల్లో 39 వేల టికెట్లు అమ్ముడుపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల్లోనూ మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది.

4వేల పాసుల కావాలంటున్న పోలీసులు..
ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకుని రాచకొండ కమిషనరేట్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, తర్వాతి స్థాయి సిబ్బంది కలిపి సుమారు 4,000 పాసులు కావాలంటూ హెచ్‌సీఏను డిమాండ్ చేస్తున్నారని ఓ అధికారి మీడియాకు తెలిపారు. పాసుల కోసం కొందరు లేఖలు ఇవ్వగా.. మరికొందరు ఫోన్ ద్వారా హెచ్‌సీఏ పెద్దలకు సమాచారం అందించారు. 'ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా పోలీసులకు పాసులు ఇస్తుంటాం. ఈసారి మాత్రం వాళ్ల డిమాండ్లు చూసి షాకయ్యాం.

10వేల పాసులైనా సరిపోవు..
భద్రత ఏర్పాట్లలో భాగంగా వివిధ ఖర్చుల నిమిత్తం పోలీసు శాఖకు లక్షల రూపాయలు ఇస్తాం. మళ్లీ పాసులు కావాలంటే ఎలా?'' అంటూ హెచ్‌సీఏ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 'పోలీసులు 4,000 పాసులు అడుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయం, ఇతర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారుల నుంచి కూడా పాసులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
వీళ్లను సంతృప్తి పరచాలంటే పది వేల పాసులైనా సరిపోవు'' అని మరో అధికారి అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌కు 10 రోజుల ముందే పరిస్థితి ఇలా ఉంటే.. 25వ తేదీ నాటికి ఎలా ఉంటుందోనని హెచ్‌సీఏ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications