T20 World Cup: ఒమన్ జట్టులో హైదరాబాద్ ప్లేయర్.. ఉద్యోగం కోసమని వెళ్లి ఏకంగా ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు!

హైదరాబాద్: టీమిండియాకు ఆడాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ అందరికి ఆ అవకాశం రాదు. దాంతో కొందరు క్రికెట్ కెరీర్ మానేసి మారోదారి చూసుకుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఓ ప్లేయర్.. ఆటపై ఉన్న ఇష్టం అతడిని మళ్లీ క్రికెటర్‌ను చేసింది. అయితే అతడు ఆడేది భారత జట్టుకు మాత్రం కాదు.. ప్రస్తుతం అతడు ఒమన్ జట్టులో ఉన్నాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. మన తెలుగోడే. అతడి పేరు శ్రీమంతుల సందీప్ గౌడ్. భారత జట్టులో ఆడాలనే అతడి కల నెరవేరలేదు కానీ.. టీ20 ప్రపంచకప్ 2021లో ఆడే ఛాన్స్ మాత్రం దక్కింది.
ఈరోజు మధ్యాహ్నం ఒమన్, పపువా న్యూగినియా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో ఒమన్ తరఫున సందీప్ గౌడ్ ఆడబోతున్నాడు. యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఆదివారం నుంచి క్వాలిఫై మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

ఒమన్ తరఫున బరిలోకి సందీప్ గౌడ్
హైదరాబాద్ నగరం కవాడీగూడకు చెందిన 29 ఏళ్ల శ్రీమంతుల సందీప్ గౌడ్.. 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఒకవైపు ఉద్యోగం వేట కొనసాగిస్తూనే మరోవైపు అక్కడి దేశవాళీ మ్యాచుల్లో ఆడాడు. సందీప్ అద్భుతమైన ఆట ప్రదర్శించాడు. దాంతో ఒమన్ దేశం అతన్ని తమ జాతీయ జట్టులో చేర్చుకుంది.
ఉద్యోగరిత్యా వేరే దేశానికి వెళ్లినా క్రికెటర్ అవ్వాలనే తన లక్ష్యానికి తగ్గట్లుగానే అడుగులు వేస్తూ ఒక్కో మెట్టు ఎదిగి తన కెరీర్‌ను అద్భుతంగా మలుచుకున్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం ఒమన్, పపువా న్యూగినియా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో ఒమన్ తరఫున సందీప్ గౌడ్ ఆడబోతున్నాడు.
ఈ మ్యాచులో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. తెలుగు ప్రజలు అందరు అతడికి ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు. బాగా ఆడాలని వారు కోరుకుంటున్నారు. సందీప్ 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

బీకామ్ చదువుకుంటూనే
నిజానికి సందీప్‌కి చిరు ప్రాయం నుంచే క్రికెటర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ చదివిన ఆల్ సెయింట్స్ హైస్కూల్ లోనే అతడు చదువుకున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ స్ఫూర్తితో క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకునేందుకు అతడు టీనేజ్ వయసు నుంచే కృషిచేశాడు.
2005-08 మధ్యకాలంలో హైదరాబాద్ అండర్-15, 19 జట్ల తరఫున సందీప్ ఆడాడు. చిక్కడపల్లిలోని అరోరా కాలేజీలో బీకామ్ చదువుకుంటూనే.. ఉస్మానియా యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయ్యాడు. 2009-10 సీజన్‌లో అండర్-22 కల్నల్ సీకే నాయుడు టోర్నీలో హైదరాబాద్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఈ టోర్నీలో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా కూడా నిలిచాడు.

రంజీల్లో అవకాశం కోసం ట్రై చేసినా
ఇక భారత్‌లో రంజీల్లో అవకాశం కోసం 2013 నుంచి ట్రై చేసినా.. సందీప్‌కి అవకాశం రాలేదు. 2016లో ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్ కంపెనీలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. అయితే జాబ్ చేసేందుకు విదేశానికి వెళ్ళినప్పటికీ క్రికెటర్ కావాలనే అతని ఆశ మాత్రం పోలేదు.
దాంతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కృషి, పట్టుదలతో జాతీయ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. ఇండియా జట్టు తరఫున ఆడే అవకాశం లభించకపోయినా.. ఒమన్ క్రికెటర్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటాడు. ఒమన్ డెవలప్‌మెంట్ ఎలెవెన్ తరఫున ఐర్లాండ్‌పై ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించడంతో (55) సందీప్ ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
నెదర్లాండ్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన సందీప్.. రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 19 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీతో రాణించి జట్టుకు ఐసీసీ వన్డే హోదా దక్కేలా చేశాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో ఒమన్ దేశం ఆడుతండగా.. ఆ జట్టులో సందీపే కీలక ఆటగాడిగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Bridget Patterson: బౌండరీ లైన్ వద్ద.. 'సూపర్ వుమెన్' స్టన్నింగ్ క్యాచ్! ఓ వాట్ ఏ క్యాచ్ (వీడియో)!!