Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Bridget Patterson: బౌండరీ లైన్‌ వద్ద.. 'సూపర్ వుమెన్' స్టన్నింగ్‌ క్యాచ్‌! ఓ వాట్ ఏ క్యాచ్ (వీడియో)!!

Adelaide Strikers fielder Bridget Patterson Takes stunning catch in WBBL vs Sydney Thunder

హైదరాబాద్: జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, బ్రెండన్ మెక్‌కల్లమ్, జాకబ్ ఓరమ్, రవీంద్ర జడేజా, స్టీవ్ స్మిత్, కిరన్ పోలార్డ్ ఇలా చెప్పుకుంటే పొతే ఎందరో పురుష క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్‌లు ఉన్నారు. మహిళల క్రికెట్‌లో మాత్రం వేళ్లమీద ఉంటుంది ఆ జాబితా. ఇప్పుడిప్పుడే వుమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో మెరుస్తున్నారు. ఇటీవల ఇండియ‌న్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమినా రోడ్రిగ్స్అద్భుత త‌న ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. బౌండరీ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసిన ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఆస్ట్రేలియా ప్లేయర్ పట్టిన వీడియో కూడాసోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విషయంలోకి వెళితే...

తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌లో బ్రిడ్జెట్‌ పాటర్సన్‌ ఓ అద్భుత క్యాచ్ అందుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లీగ్‌లో శనివారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ థండర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ ఛేదనలో 19వ ఓవర్‌లో ఇసాబెల్లె వాంగ్‌ (6) బ్యాటింగ్‌ చేస్తుండగా.. నాలుగో బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడింది. వాంగ్‌ కొట్టిన షాట్‌తో బంతి బౌండరీ లైన్‌ దాటిపోయేలా కనిపించింది. సరిగ్గా అప్పుడే అడిలైడ్‌ ఫీల్డర్‌ బ్రిడ్జెట్‌ పాటర్సన్‌ సూపర్ క్యాచ్ అందుకుంది. గాల్లోకి ఎగిరి తనని తాను బ్యాలెన్స్‌ చేసుకొని నమ్మశక్యం కాని క్యాచ్‌ అందుకుంది. దాంతో అడిలైడ్‌ ప్లేయర్స్ సంబరాలు చేసుకోగా.. వాంగ్‌ నిరాశగా పెవిలియన్ చేరింది.

బ్రిడ్జెట్‌ పాటర్సన్‌ బౌండరీ లైన్‌పై గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకుంది. అయితే ఆమె బాలెన్స్‌ కోల్పోయింది. దీంతో బౌండరీ లైన్‌కు ఆనుకునేలా మునివేళ్లపై నిల్చొని బంతిని మళ్లీ గాల్లోకి విసిరింది. ఆపై బ్రిడ్జెట్‌ బౌండరీ దాటి తిరిగి మైదానంలోకి వచ్చి బంతిని అందుకుంది. తొలుత బంతి అందుకున్నప్పుడు ఆమె రెండు పాదాలు నేలకు ఆనించిన సమయంలో బౌండరీ లైన్‌కి టచ్‌ కాకుండా అతికష్టం మీద తన శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంది. దీనికి సంబందించిన వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 'సూపర్ వుమెన్' స్టన్నింగ్‌ క్యాచ్‌, ఓ వాట్ ఏ క్యాచ్ అంటూ వీడియో చూసిన వారు పోస్టులు పెడుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ (42), మాడ్‌లైన్ పెన్నా (35) రాణించారు. సిడ్నీ థండర్ బౌలర్లలో లారెన్ స్మిత్ రెండు వికెట్లు పడగొట్టింది. ఆమె తన కోటా నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు మాత్రమే ఇచ్చింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్‌ 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్‌ అయింది. కొరిన్నె హాల్ (38) టాప్ స్కోరర్. మెక్‌గ్రాత్ మూడు వికెట్లు తీసింది. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి తన జట్టుకు సునాయాస విజయాన్ని సాధించింది. బ్యాటు, బంతితో రాణించిన మెక్‌గ్రాత్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఎంపికైంది.

Story first published: Sunday, October 17, 2021, 15:05 [IST]
Other articles published on Oct 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+