For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత అండర్ 19 కెప్టెన్‌గా హైదరాబాద్ కుర్రాడు!

అఫ్గానిస్థాన్ అండర్ 19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రెండు జట్లను ప్రకటించింది. అండర్ 19 భారత్-ఏ, అండర్ 19 భారత్-బీ జట్లు అఫ్గానిస్థాన్ అండర్ 19 టీమ్‌తో ముక్కోణపు సిరీస్ ఆడనుంది. అండర్ 19 ఏ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహిస్తుండగా.. అండర్ 19 బీ జట్టుకు సారథ్యం వహించే అవకాశం హైదరాబాద్ కుర్రా ఆరోన్ జార్జ్‌కు దక్కింది.

ఆరోన్ జార్జ్ ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక దేశవాళీ అండర్ 19 టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించాడు. అసాధారణ ప్రదర్శన, సారథ్యంతో హైదరాబాద్ జట్టును విజేతగా నిలబెట్టాడు. ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్‌ ట్రోఫీలో అతను గత మూడేళ్లుగా టాప్ స్కోరర్‌గా నిలుస్తూ వచ్చాడు. ఇటీవల ముగిసిన ఎడిషన్‌లోనే 2 సెంచరీల సాయంతో 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు.

Hyderabad Player Aaron George named India Under-19 captain for triangular Series against Afghanistan
Photo Credit: X (twitter)

స్కూల్ క్రికెట్‌లో సత్తా చాటిన ఆరోన్ జార్జ్‌కు 2022లో హైదరాబాద్ అండర్ -16 జట్టులో చోటు దక్కింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో సత్తా చాటిన అతను ఒక ట్రిపుల్ సెంచరీతో పాటు 511 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో ఆరోన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి ఏడాది చదువుతున్నాడు.

ఏ స్థాయిలోనైనా భారత జట్టు తరఫున ఆడాలనేది నా కల. ప్రస్తుతం నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నా. అండర్ 19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఆరోన్ జార్జి స్వరాష్ట్రం కేరళ. వారి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఆరోన్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా వీలు చిక్కినప్పుడల్లా కొట్టాయంలో ఉంటున్న తన తాత, బామ్మ దగ్గరికి వెళ్లి వస్తుంటాడు.

Story first published: Wednesday, November 12, 2025, 16:04 [IST]
Other articles published on Nov 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+